నూతనంగా ఏర్పాటైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చింది . గ్రామా ,వార్డు సచివాలయాలు ఏర్పాటుతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఇందులో భాగంగా 459 సచివాలయాలు ఏర్పాటుకు  రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వ నిర్ణయంతో 4,590౦ మంది యువత ఉద్యోగాలు సాధించబోతున్నారు. ఉద్యోగాల కల్పనపై నిరుద్యోగుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ని మున్సిపాలిటీల్లో వార్డ్ సచివాలయాలు ఏర్పాటు కసరత్తు పూర్తయింది.

వార్డ్, గ్రామా సచివాలయ వ్యవస్థ ఏర్పాటును సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 57 మండలాల్లో ని 1031 పంచాయితీల్లో 866 గ్రామా సచివాలయాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే తరహాలో పట్టణాల్లో  సైతం వార్డ్ సచివాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు నగరపాలక సంస్థతో పాటూ 12 మున్సిపాలిటీల్లో 459 వార్డ్ సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి. మున్సిపాలిటీల్లో నాలుగు వేల మంది జనాభాకు ఒకటి చెప్పున ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేయనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని 12 మున్సిపాలిటీలు , నగర పాలక సంస్థ పరిధిలో 16.73 లక్షల మంది జనాభా ఉన్నారని తెలియజేసారు. ఈ జనాభాకు 10.98 శాతం అదనంగా జనాభను లెక్కించి ప్రభుత్వం వార్డ్ సచివాలయాలు ఏర్పాటు చేయనుంది. ఈ లేక్కన జిల్లాల్లో, పట్టణాల్లో 459 వార్డ్ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి.

ప్రతీ వార్డ్ సచివాలయంలో స్థానికంగా నివసిస్తున్న పది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం  ఉద్యోగం  కల్పించనుంది. ఈ లెక్కన 459 సచివాలయంలో 4,590 మంది నిరుద్యోగులకు కొలువు లభించనుంది. సొంత ఊరిలో ఉపాధి లభించనుండడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సొంత ఊర్లలో సగౌరవంగా బతికేందుకు యువత పోటీ పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: