అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  తాజాగా నిరుద్యోగులకు శువార్త చెప్పింది.  ప్రైవేటు సంస్ధల్లో భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో స్ధానికులకే 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

 

పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగులు జగన్ కలిసి స్ధానికులకే ఉద్యోగవకాశాల అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆ విషయమై బాగా కసరత్తు చేసిన జగన్ వారి డిమాండ్ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి రాగానే ఆ దిశగా కసరత్తు చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు.

 

అయితే తాజాగా ఆదేశాల పరిధి దాటి ఏకంగా ఉత్తర్వులే జారీ చేశారు. ’ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిటేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ యాక్ట్’  ఉత్తర్వులను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.  ఈ ఉత్తర్వలు ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ ఏ ఫ్యాక్టరీ ఏర్పాటైనా ఆ ప్రాంతంలోని వారికే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలి. ఈ ఉత్తర్వులు గనుక నిజంగానే అమల్లోకి వస్తే నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: