ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేధికగా కరెంటు సమస్యలపై స్పందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చి కనీసం 50 రోజులు అయినా అవ్వలేదు, ప్రతిపక్షం నేతలు బురద చల్లడం మొదలు పెట్టారు. అనవసరంగా లేని కారణాలను చూపించి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 


పుట్టిన పసికందు నుంచి వృద్ధుడి వరుకు ప్రతి ఒకరికి ఉపయోగపడే పథకాలు అందేలా చూస్తుంటే, అయనపై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేధికగా కరెంటు సమస్యలపై వచ్చే విమర్శలు చేసే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు. 


సీఎం స్పందిస్తూ 'అవసరం లేకున్నా గత ప్రభుత్వం కావాల్సిన కంపెనీలతో అధిక రేట్లకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు వల్ల ఏటా రూ. 2,766 కోట్ల నష్టం. ఈ భారాన్ని మోసే పరిస్థితుల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు లేవు. పీపీఏలను సమీక్షించి, రేట్లు తగ్గించి ప్రజలకు,ప్రభుత్వానికి న్యాయం చేస్తాం'. అంటూ ట్విట్ చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: