మరికొద్ది గంటల్లో 'బిగ్ బాస్ సీజన్ -3' మొదలుకానుంది. నాగార్జున యాంకర్ గా వ్యవహరిస్తున్న సీజన్ 3 లో...హౌస్ మెంబర్లు ఎవరు అన్న దానిపై ఇప్పటికే అనేక రకాల వార్తలు రావటం సోషల్ మీడియాలో మనం చూశాం. ముఖ్యంగా ప్రస్తుతం జరగబోయే సీజన్లో కేవలం సెలబ్రిటీలే ఉండేటట్లు షో నిర్వాహకులు ప్లాన్ చేశారని అనేక వార్తలు రావడం జరిగాయి. ఇటువంటి నేపథ్యంలో రెండవ సీజన్ లో హౌస్ నంబర్ గా ఉన్న నూతన్ నాయుడు ఒక ఆసక్తికరమైన వీడియోని పోస్ట్ చేశారు.


విషయంలోకి వెళితే ఆ వీడియోలో అనుకోకుండా  బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల పేర్లు లీక్ చేసేశాడు. ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమని పేర్లు ప్రకటించాడు. నూతన్ నాయుడు ఎవరెవరు..పేర్లు ప్రకటించారంటే. నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(దంపతులు), టీవీ ఆర్టిస్ట్ రవికృష్ణ, అలీ రెజా, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌ స్మాష్ స్టార్ అశు రెడ్డి ఉన్నారు.


మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లిస్టులో టీవీ9 యాంకర్ ముఖాముఖి కార్యక్రమం తో పాపులర్ అయిన జాఫర్ కూడా ఉన్నాడని నూతన్ నాయుడు తెలిపారు. మరి నూతన్ నాయుడు చెప్పిన ఈ పేర్లు గల మనుషులు ఆదివారం వస్తారో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: