ఎందులో మీరు ఆదర్శం అని చంద్రబాబుని అడిగారంటే అది జగన్ అజ్ఞానమో లేక అమాయకత్వమో అర్థంకాలేదని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో తొలిసారి విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి, చంద్రబాబు ఆదర్శం గా నిలిచారని నారా లోకేష్ గుర్తు చేశారు. రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు డిస్కాంలకు ఆరు వేల ఆరు వందల రూపాయలు బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాన్న గారు (రాజశేఖర్ రెడ్డి) దే అని పేర్కొన్నారు.
మీ నాన్న పెట్టిన బకాయిలను పూడ్చేందుకు రెండు వేల పదిహేను లో ఉదయ్ పథకంతో సరి చేసే ప్రయత్నం చేశామని నారా లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు కష్టాన్నే మీ నాన్న గారు ఉచిత విద్యుత్ అని దోచేసుకున్నారని జగన్ ను ఉద్దేశించి ఆరోపించారు.