ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. చచ్చిన పామును మళ్ళి మళ్ళి కొట్టి చంపినట్లు, ఇప్పటికే ఓడిపోయి బాధలో ఉన్న టీడీపీ నేతలపై సంచలనం వ్యాఖ్యలు చేస్తున్నారు విజయసాయి రెడ్డి. ఎన్నికలు ముగిసాకా రాజకీయ నాయకులూ ప్రజలలో కంటే ట్విట్టర్ లోనే ఎక్కువ కనిపిస్తున్నారు అని అంటున్నారు నెటిజన్లు.  

 

చంద్రబాబు, అతని తనయుడు నారాలోకేష్ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చెయ్యడాం. వైసీపీ నుంచి విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం అలవాటు అయిపోయింది. కొందరు నెటిజన్లు అయితే 'తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ కే అంకితం అంటూ ట్విట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని వారికీ వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 


విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ప్రతిపక్షం అవినీతిపై స్పందిస్తూ 'జుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్తు పీపీఏలపై సమీక్ష వంటి నిర్ణయాలతో చంద్రబాబు, ఆయన కోటరీకి వెన్నులో వణుకు మొదలైంది. రూపాయి కూడా అవినీతి జరగలేదని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. కొందరు పార్టీ మారి ఎస్కేప్ రూట్ పట్టారు. ఏం చేసినా తప్పించుకోలేరు.' అంటూ వ్యాఖ్యానించారు. ఈ ట్విట్ టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: