మొదటినుంచీ కొత్త కథలతో  వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ తెలుగు తమిళ  ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ హీరో ఆది పినిశెట్టి. కాగా ఆది ప్రస్తుతం  ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు.   ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో తెర‌కెక్కుతుంది.  ఓ యువ‌కుడు అథ్లెట్‌ గా మారే క్ర‌మంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. వాటిని ఎలా అధిగ‌మించి ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం.  స్పోర్ట్స్ డ్రామాలో  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో  రానున్న  ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. 


ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్   రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఐఐటీ ఈ  షూట్ కోసం ఆది  ఫుల్ గా కఠినమైన కసరత్తులు కూడా చేస్తోన్నాడట.   థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రానున్న   ఈ చిత్రాన్ని  బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: