ఏపి ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ప్రజలకు తాను ఇచ్చిన నవరత్నాల పథకాల అమలుకు సర్వం సిద్దం అవుతున్నారు.  అమ్మఒడి,వృద్దాప్య పిన్షన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాావకాశాలు, పల్లె నిద్ర ఇలాా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు..అమలు పరుస్తున్నారు.  తన పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవొద్దని..అన్ని వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 


సీఎం వైఎస్ ప్రవేశ పెట్టిన పల్లెనిద్ర పథకం ద్వారా ఉన్నతాధికారులు పదమూడు జిల్లాలో తమ పరిధిలోని గ్రామాలు సందర్శించి అక్కడ ఉన్న అన్ని ఇబ్బందులు గమనించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.  పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, విద్యార్థుల వసతీ గృహాల తీరు తెన్నులు అధికారులు గమనిస్తున్నారు.  ఈ సదర్భంగా  అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తన మానవత్వాన్ని చాటుకున్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ ఈనెల 19న గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు గ్రామంలో పర్యటించారు.


అక్కడ ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడ ఎంతో మంది విద్యార్థులు అనాథలుగా ఉండటాన్ని గమనించారు.   హాస్టల్లో ఉంటున్న వడ్డే నరసింహులు అనే విద్యార్థి గురించి తెలుసుకుని కలెక్టర్ చలించిపోయారు. ఇకపై బాలుడి బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని.. అనంత ఆణిముత్యాలు పథకం ద్వారా విద్యార్థికి చదువు పూర్తయ్యే వరకు సాయం చేస్తానని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: