ఓక పక్క కర్నాటకం రసవత్తరంగా సాగుతూనే ఉండగా, రాజ్యసభలో సాధ్యమైనంత మంది విపక్ష సభ్యులను ఆకర్షించే పనిలో నిమగ్నమైంది కమలం పార్టీ. లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీ ,245 మంది సభ్యులున్న రాజ్యసభలో మాత్రం మెజారిటీకి కావల్సిన 124 సీట్ల కంటే తక్కువ సంఖ్య (102) ఉండటంతో కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకోలేని పరిస్థితి. దీంతో రాజ్యసభలో తమను వ్యతిరేకిస్తున్న పార్టీల బలాన్ని తగ్గించి, తమ బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతుంది.

అందులో భాగంగానే, ఆంధ్రప్రదేశ్ లోని "తెలుగుదేశం" పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమవైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైన బీజేపీ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కి చెందిన మరో సైకిల్ పార్టీ "సమాజ్ వాదీ పార్టీ" పై గురిపెట్టింది. తెలుగుదేశం పార్టీ లోని ముఖ్యులను తమవైపు తిప్పుకోవడంలో అనుసరించిన వ్యూహాలనే యూపీ లో సైతం ఆచరణలో పెట్టింది.


సమాజ్ వాది పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ప్రధాని చంద్రశేఖర్ తనయుడు నీరజ్ శేఖర్ ,తన చేరిక సందర్బంగా చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎస్పీలో అఖిలేష్ యాదవ్ నాయకత్వం పట్ల చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని, త్వరలో యూపీ బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని నీరజ్ పేర్కొన్నారు. యూపీలో విపక్ష రాజ్యసభ సభ్యుల వేటలో ఉన్న బీజేపీ, తమతో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్న ఏ ఒక్కరిని విస్మరించడం లేదు.


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీపీ ని తమలో విలీనం చేసుకున్న బీజేపీ, యూపీ లో ఎస్పీ ని కూడా ఆదిశగా టార్గెట్ చేసుకున్నట్లుంది. ఇటు ఆంధ్ర సైకిల్ పార్టీ చతికిల పడ్డ నేపథ్యంలో,ఆ పార్టీకి ఎంతో కాలంగా అండగా ఉన్న కమ్మ,కాపు సామాజికవర్గ నాయకులను తమ పార్టీలో చేర్చుకొని ఆంధ్రలో వైసీపీ కి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: