స‌హ‌జంగా మ‌న‌కు ఎంతో ఇష్టం ఉన్న‌వాళ్లు మ‌న‌ల్ని మోసం చేస్తే ఆ బాధ‌ను త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం. అయితే ప్ర‌స్తుత స‌మాజంలో  ఒక‌రినొక‌రు మోసం చేసి.. వేరే వాళ్ల‌తో ఎఫైర్‌ పెట్టుకోవ‌డం కామ‌న్ అయిపోయింది. అయితే ప్ర‌స్తుతం విచిత్రంగా తిరువనంతపురంలో ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెంపుడు జంతువులను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేవారు చాలా మంది ఉన్నారు. వాటికి ఏం జరిగినా తట్టుకోలేని వారు ఉంటారు. 


అయితే తిరువ‌నంత‌పురంలో ఓ వ్య‌క్తి ప్రానం క‌న్నా ఎక్కువ‌గా చూసుకున్న కుక్కు మోసం చేసింద‌ని న‌డిరోడ్డు మీద వ‌దిలేశాడు. తాను ఎందుకు వ‌దిలేశాడో కూడా ఆ కుక్కుమెడ‌లో ఓ బోర్డ్ పెట్టాడు. విచిత్రంగా ఉంది క‌దూ..ఇంతకీ ఆ రీజన్ ఏంటో చూడండి.. తిరువనంతపురంలోని ఓ బిజీ రోడ్డులో పొమేరియన్ జాతికి చెందిన ఓ కుక్క అటు ఇటూ తిరుగుతోంది. ఎటు పోవాలో తెలియక తికమకపడుతోంది. 


అది చూసిన కొందరు వ్యక్తులు ఆ కుక్కను దగ్గరకు తీసుకున్నారు. దాని మెడలో ఒక నోట్ వేళ్లాడటాన్ని గమనించి ఏంటో చదివారు. ఆ నోట్‌లో కుక్కకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. టాప్ బ్రీడ్‌కు చెందిన ఆ కుక్క చాలా మంచిదని దానిపై రాసుంది.కేవలం అరవడమే కాని కరవడం తెలియని దాని వయసు మూడేళ్లని, మిల్క్, బిస్కెట్, ఎగ్స్‌కు ఇష్టంగా తింటుందని దాని ఆహారపు అలవాట్లను వివరించారు.  


అయితే ఆ కుక్క తమ పక్కింట్లోని మరో కుక్క‌తో ఎఫైర్  పెట్టుకుందని..దాన్ని త‌ట్టుకోలేక వ‌దిలేశాన‌ని పేర్కోన్నాడు. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయినా కుక్క‌ల‌ను ఇలా చేస్తారా అని నెటిజ‌న్లు త‌ప్పుప‌డుతుంటే.. మ‌రి కొంద‌రు ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: