తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గుడిమెల్లంక వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పంట కాల్వలోకి ద్విచక్రవాహనం దూసుకుపోయింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా, మరో యువతి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా గ్రామానికి సుగుణ తన ఇద్దరు పిల్లలు భార్గవి(5), కిరణ్మయి(4)తో కలిసి అన్న బ్రహ్మాజీ, వారి బంధువు కృప(23) ఒకే ద్విచక్రవాహనంపై నాటు వైద్యం చేసుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిమండలం పెదలంకకు వెళ్తున్నారు. 

గుడిమెల్లంక వంతెన సమీపంలోని వినాయకుని గుడివద్ద వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి గుడిమెల్లంక ప్రధాన పంట కాల్వలోకి దూసుకుపోయింది. బ్రహ్మాజీ, సుగుణలకు ఈతరావడంతో బయటకు వచ్చేశారు. కృప, భార్గవి, కిరణ్మయి 
 పంటకాల్వలో మునిగి గల్లంతయ్యారు. 

గమనించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కృప, భార్గవి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. ఐదేల్ల భార్గవి మృతదేహం సాయంత్రసమయంలో కాలువ దరికి చేరుకుంది. మలికిపురం ఎస్సై రామారావు వారి సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: