విశాఖ ఎయిర్ పాసింజర్స్ కు విమానయాన సంస్థలు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. ఎయిర్ లైన్స్ కంపెనీల ఒక్కొక్కటి గా స్టీల్ సిటీ కి గుడ్ బై చెప్పేస్తున్నాయ్. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దచ్చగా ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ అదే బాటలో నడుస్తున్నాయి.


ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో సర్వీసుల తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖపట్టణం జెవెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా దేశంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇవన్నీ వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ను రెట్టింపు చేస్తాయి. ఎయిర్, వాటర్, రోడ్ కనెక్టివిటీ కలిసి రావడంతోనే అభివృద్ధిలో దూసుకుపోతోంది.


ఇంటర్నేషనల్ డెస్టినేషన్ గా రూపొందుతోంది దీంతో విమానయాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఏటా లక్షలాది మంది విశాఖకు రావడం వెళ్లడం కానిచ్చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి తగ్గట్టు గా సర్వీసుల సంఖ్య పెరగాల్సి ఉండగా ఎయిర్ లైన్స్ కంపెనీ లు ఒక్కొక్కటిగా స్టీల్ సిటీకి ముఖం చాటేస్తున్నాయి.


లాభదాయకంగా లేదని కారణంతో సర్వీసులను రద్దుచేసుకుంటున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ తో పాటు రెవిన్యూ అధికంగా వస్తున్న సెక్టార్ లను ఎంచుకుంటున్నాయి. ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిర్ అలియన్స్ విశాఖ విజయవాడ తిరుపతి మధ్య విమానాన్ని రద్దు చేసుకుంది. వాస్తవానికి ఈ సర్వీసు ను ప్రారంభించినపుడు రీజినల్ కనెక్టివిటీ కల్పిస్తున్నందుకు గాను కొంత మొత్తం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


దీనికి సంబంధించి సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది అలాగే విశాఖపట్టణం కొచ్చిన్ కు విమాన సర్వీసు రద్దు అయింది. మరోవైపు కోల్ కత వెళ్లే సర్వీసులను ఇండిగో బెంగుళూరుకు నడిపే రెండు సర్వీసులను నిలిపివేసింది జెట్ ఎయిర్ వేస్ సంక్షోభంతో ఢిల్లీ ముంబయి సర్వీస్ కు బ్రేకులు పడ్డాయి తాజాగా ఇండిగో సంస్థ హైదరాబాద్ చెన్నై నగరాలకు టిక్కెట్ల విక్రయాలను నిలిపి వేసిందని ట్రావెలర్స్ చెబుతున్నారు.


ఈ పరిస్థితికి రెండు బలమైన కారణాలు ఉన్నాయని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ చెబుతోంది. ఒకటి ఎయిర్ క్యారియర్ కొరత కాగా రెండోది గత ప్రభుత్వం అనుసరించిన విధానం విమానయాన సంస్థలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన సర్కారు నిలబెట్టుకోలేదు ఫలితంగా నష్టాలు వస్తున్నాయన్న కారణం తో విమానయాన సంస్థలు విశాఖకు ముఖం చాటేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: