ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండ మెజార్టీ తో గెలిపించి సీఎం జగన్ పై తెలుగు దేశం కంటే దూకుడుగా బిజెపి ఎందుకు విమర్శలు చేస్తోంది. ఎపి బిజెపి నేతలు కన్నా, పురందరేశ్వరి, మాణిక్యాలరావు, మాధవ్, ఎందుకు దూకుడుగా దండయాత్ర చేస్తున్నారు? బిజెపి బిగ్ బాస్ అమిత్ షా నుంచి క్లియర్ ఇండికేషన్స్ వచ్చేశాయా? 


ఏపీలో అధికార వైకాపా లో ఇన్నాళ్లు పరోక్షంగా అంటకాగిన బిజెపి ఇకపై ప్రత్యర్థిగా మారబోతోందా ఆ మేరకు వైకాపా ప్రభుత్వా నిర్ణయాలను టార్గెట్ చేయాలని అధిష్టానం నుంచి కాషాయ నేతలకు ఆదేశాలందాయ?  గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బిజెపి ఇదే విధంగా దూకుడు ప్రదర్శించింది వైకాపా కంటే బీజేపీ విమర్శలు ఎక్కువ ఉండేవి. టీడీపీ వర్సెస్ బీజేపీ గా రాజకీయ వాతావరణం నెలకొంది అంతమాత్రాన ఒక్క శాతం ఓట్లు రాలేదు రాష్ట్రంలో అధికార వైకాపానే టార్గెట్ చేయడం ద్వారా టిడిపి కంటే తామే ప్రత్యామ్నాయం కాగలదా నయానో భయానో ఏదో ఒకలా ఏపీలో ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా సున్నితమైన అంశాలను సైతం తెరపై కి తెస్తోంది.


ముఖ్యంగా మతపరమైన అంశాలు తీసుకురావటం కోసం తద్వారా రాష్ట్రం లో వాటిపైన తీవ్రమైన చర్చ జరిగేలా కాషాయ నేతలు వ్యూహ రచన చేస్తున్నారని ఆరోపణలున్నాయి. సాంప్రదాయ రాజకీయ నాయకురాలుగా పేరు పొందిన బిజెపి సీనియర్ నేత ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి మతమైన అంశాలను తీసుకురావటం బట్టి చూస్తే బిజెపి భవిష్యత్తు రాజకీయం సామాన్యు లు సైతం సులువు గా అర్థమవుతుంది. విశాఖలో ఓ చర్చిపై దాడులు జరగొచ్చని సమాచారం తో భద్రత పెంచారు ఈ  అంశాన్ని పురందరేశ్వరి ఈమధ్య ఎక్కడికెళ్ళినా ప్రస్తావిస్తున్నారు.


యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి గా పని చేసిన అనుభవం ఉన్న పురందరేశ్వరి కి గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారనే పేరుంది. కానీ ఆమెలాంటి వారు సైతం ఫక్తు ఆరెస్సెస్ నేపథ్యంలో ఈ తరహాలో మతపరమైన అంశాలు తెరపైకి తీసుకొచ్చి వైకాపా ప్రభుత్వం టార్గెట్ చేయడం బట్టి చూస్తే కాషాయ రాజకీయం ఎలా ఉండబోతోందో అమిత్ షా యొక్క లెక్క ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. పురంధ్రేశ్వరితో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సైతం ఈ మధ్య వైకాపా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. అది శాసన సభలో కాస్తో కూస్తో బలం ఉన్న టిడిపికి మించి ప్రతి అంశాన్ని రాజకీయంగా విమర్శించేందుకు కన్నా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇదంతా అమిత్ షా డైరెక్షన్ లో జరుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: