ఈ భూమ్మీదకు మనం రాగానే మనల్ని చూసి కన్నీళ్లతో ఆనందించే వ్యక్తి అమ్మ మాత్రమే. అలాంటి తల్లి మనసు రాయిలా మారింది, కన్నా బిడ్డను చంపేంత కసాయి రాలుగా మారింది. కంటికి రెప్పలా కాపాడిన కన్న తల్లి, కన్న బిడ్డను కాటేసింది. అభం శుభం తెలియని పసి మొగ్గను చిదిమేసింది. ఆరోగ్యం సరిగాలేదని మూడు నెలల పసికందును బిల్డింగ్ పై నుండి విసిరేసింది కన్న తల్లి.
 
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘరక్ పూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు,ఆసుపత్రి అధికారులు చెప్పిన కథనం ప్రకారం... యూపీ కి చెందిన ఇరవై ఏడేళ్ల శాంతాదేవి ఏప్రిల్ 23న బి ఆర్ డి ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బాబు పుట్టిన తర్వాత బిడ్డకు పచ్చకామర్లు వచ్చాయి. దీంతో చిన్నారి కాలేయం పరిస్థితి క్షీణించడంతో  ఆస్పత్రి అధికారులు మెరుగైన చికిత్స కోసం కేజీ ఎం యు ఆస్పత్రికి తరలించారు.
 
మే 26 నుంచి పిల్లాడికి కామెర్లకు చికిత్స అందిస్తున్నామని, ఆ పిల్లాడు కోలుకుంటుందని హాస్పిటల్ డాక్టర్ సందీప్ తివారీ చెప్పారు. అయితే చిన్నారి తల్లి మాత్రం బిడ్డ ఆరోగ్యంగా ఉండడం వల్ల ఆమె విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైందని హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు. శిశువు పుట్టినప్పుడు కూడా కేవలం కిలో బరువు మాత్రమే ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.  పిల్లాడి ఆరోగ్యంపై విపరీతమైన కోపంతో ఉన్న పిల్లాడి కన్నా తల్లి ఈరోజు 5గంటలకు ఆసుపత్రి నాలుగో అంతస్తు నుండి పిల్లల్ని విసిరేసింది. తర్వాత తిరిగి వచ్చి ఏమీ తెలియనట్టు అలారం మోగించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: