మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో అన్ని వార్డులను గెలుచుకోవాలని అటు అధికార పక్ష వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ అపుడే  వ్యూహ రచన చేస్తున్నాయి. దాంతో అంగబలం, అర్ధబలం ఉన్న వారిని బరిలోకి దింపాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే


త్వరలో జరగనున్న  జీవీఎంసీ  ఎన్నికల్లో ఖర్చు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెట్టాల్సి ఉంటుందని ఆశావహులు అపుడే లెక్కలు వే సుకుంటున్నారు.   వార్డ్ కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్న వారు కచ్చింతంగా రెండు కోట్లు ఖ‌ర్చు చేయాల్సిందేనంట. ఈ కోట్ల లెక్కతో ఆశావహులు హడలిపోతున్నారుట. వైసీపీలో పదేళ్ళుగా పనిచేస్తున్న కార్యకర్తలు ఏ అధికార పదవిని ఇంతవరకూ నోచుకోలేదు. కేవలం వైఎస్సార్ కుటుంబం మీద అభిమానంతోనే వారు చేతి చమురు వదిలించుకుని పనిచేస్తూ వచ్చారు.


 తమ సేవలను గుర్తించి పార్టీ టికెట్ ఇచ్చి గెలిపిస్తుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీ నాయకులు మాత్రం భారీగా ఖర్చు చేసిన వారికే టికెట్లు అంటూ ప్రకటనలు చేయడంతో అసలైన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పైగా టికెట్లు నిజమైన క్యాడర్ కి దక్కుతాయో లేదోనని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: