బీజేపీ కన్ను రెడ్ల మీద పడింది. ఉమ్మడి ఏపీలో రెడ్లు తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వారు దశాబ్దాల తరబడి అధికారాన్ని అనుభవించారు. హస్తం పార్టీని కూడా బలోపేతం చేశారు. రాజకీయంగా రెడ్లు నంబర్ వన్ ఒకపుడు...


తెలంగాణాలో తాజా ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి సరికొత్త ఆశలు మొదలయ్యాయి.. తెలంగాణాలో వెలమ పాలన సాగుతోంది. అందువల్ల  బలమైన సామాజికవర్గంగా ఉన్న రెడ్లు రాజకీయ వాటా దొరక్క సతమతమవుతున్నారు. వారిని తమ వైపునకు తిప్పుకోవడానికే బీజేపీ తెలివిగా కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేసింది. కిషన్ రెడ్డి కూడా మంచి మాటకారి. అనేక ఉద్యమాలను చేసిన వాడు. ఆయన చురుకుదనం, కులబలం పెట్టుబడిగా పెట్టి రేపటి రోజున తెలంగాణా గెలవాలని బీజేపీ ఆలోచనగా ఉంది. 



ఇక ఏపీలో చూసుకుంటే జగన్ రెడ్డి సామాజికవర్గంలో ఏకైక నాయకునిగా ఉన్నారు. ఆ వర్గాన్ని ఆకట్టుకుంటేనే తప్ప బీజేపీకి విజయం సాధ్యం కాదు. కమ్మ సామాజికవర్గం  ఎటూ బీజేపీకి కొంత బలంగా ఉంది. టీడీపీ ఎంత బలహీన పడితే అంతలా ఆ వర్గం బీజేపీ చెంతన చేరడం ఖాయం. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అధికారంలో ఉన్న జగన్ని దెబ్బతీయాలంటే ఆయన ఆయువు పట్టుగా ఉన్న రెడ్లను చేరదీయాలి.



దుకే ఆ వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకుని తురుపు ముక్కలా ప్రయోగించాలనుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లను దువ్వడం ద్వారానే అధికార పీఠాన్ని అందుకోగలమని బీజేపీ గట్టి అంచనాలే వేసుకుంది


మరింత సమాచారం తెలుసుకోండి: