ఏపీలో ఉప ఎన్నికలకు నగారా మోగనుందా. అంటే అవుననే అంటోంది రాజకీయం. ఏపీలో జగన్ రెడ్డి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అలా ఇలా కాదు బంపర్ మెజారిటీతో వచ్చారు. ఆయన పార్టీ అసెంబ్లీ ఎన్నీకల్లో వూడ్చేసింది. కానీ...


ఇక టీడీపీకి ఉన్నవి 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే. ఇందులో నుంచి కూడా కొందరు పార్టీ వదిలి వెళ్ళే యోచనలో ఉన్నారని టాక్. ఇక జగన్ అయితే గేట్లు తెరవను అంటున్నారు, కానీ తెరవాలని గేటు వద్ద పెద్ద క్యూ కనిపిస్తోంది. పార్టీలో చేర్చుకుంటామంటే జగన్ వైపు వచ్చేయడానికి కనీసం అరడజన్ మంది  ఉన్నారట.


మరి జగన్ సై అంటే వారు పార్టీకి రాజీనామా చేసి వచ్చేస్తామంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో ఉప ఎన్నికలు ఖాయమంటున్నారు. టీడీపీలో ఓ సీనియర్ నేత, ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇపుడు పక్క చూపులు చూస్తున్నారు. అలాగే మరికొంతమంది  జగన్ హామీ ఇస్తే తాము కూడా రాజీనామా చేస్తామని  అంటున్నారు. ఇవన్నీ కలుపుకుంటే మరి కొద్ది నెలలలో ఏపీలో ఉప ఎన్నికల సమరం ష్యూర్ గా వచ్చేలా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: