జగన్ సర్కార్ అంటేనే నవరత్నాలు. తొమ్మిది హామీలతో సామాన్యుడి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్నది జగన్ ఆలోచన. ఆ దిశగానే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అడుగులు వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం నుంచే కూడా జగన్ నవరత్నాల అమలు అంటూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరి అటువంటి కీలకమైన నవరత్నాల విషయంలో...


జనం మాట ఏంటి, వారి సంత్రుప్తి స్థాయి ఎలా ఉంది. ఈ విషయాలపై జగన్ సర్కార్ కి ఇంటెలెజెన్స్ రిపోర్ట్ షాకింగ్ న్యూస్ చెప్పిందంట. జనంలో ఇప్పుడు నవరత్నాల మీద మిశ్రమ స్పందన ఉన్నట్లుగా ఆ రిపోర్ట్ చెప్పిందట. నవరత్నాల అమలు తీరుపైనే జనం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారని టాక్.


నవరత్నాలలో ఒకటైన వ్రుధ్ధులకు పించను విషయంలో వారు కొంత అసంత్రుప్తిగా ఉన్నారట. మూడు వేల రూపాయకు పెంచుతామని చెప్పిన పించను రెండువేల రెండు వందల యాభైకే పరిమితం చేయడం పట్ల అసంత్రుప్తి గా ఉన్నట్లు ఇంటెలెజెన్స్ రిపోర్ట్ తేల్చిందట. అయినా ఎంతో కొంత ఎక్కువ ఇస్తున్నారు, మరి కొంతకాలానికి పూర్తి మొత్తం వస్తుందన్న ఆశతో ఉన్నారట.


అలాగే రైతు భరోసా స్కీం కూడా రైతులకు కొంత మేరకే సంత్రుప్తిని ఇచ్చిందట. ఏడాదికి 12,500 అంటూ జగన్ చెప్పినా అందులో 6500 కిసాన్ సమ్మాన్ నిధిని కలిపి ఇవ్వడం వల్ల రైతులు కొంత నిరాశలో ఉన్నారట. ఏది ఏమైనా ఇది తమకు ఆసరావేనని రైతన్నలు అంటున్నారుట. 


ఇక మధ్యపాన నిషేధం విషయంలో జగన్ కమిట్మెంట్ కి జనంలో భిన్నమైన స్పందన వస్తోందట. మద్యాన్ని నిషేధిస్తే సారా బట్టీలు పల్లెల్లో వస్తాయన్న భ‌యమే ఇందుకు కారణమట. మొత్తానికి జగన్ దూకుడుగా తీసుకుంటున్న కూడా జనంలో ఇంకా పూర్తిగా అనుకూలత రావడం లేదు. 


దీని మీద వైసీపీ సర్కార్ కొంత ఆందోళలో ఉన్నా  పధకాలు పూర్తిగా అమలు అయి పాలన గాడిలో పడితేనే అసలైన జనాభిప్రాయం తెలుస్తుంది అంటున్నారు. ప్రస్తుతానికైతే నవరత్నాలు జగన్ కి షాక్ ఇస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: