ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 1వ తేదీన కుటుంబ సభ్యులతో కలసి జెరుసలేం పర్యటనకు వెళ్లనున్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జెరుసలేంలో పర్యటించి రాష్ట్రానికి తిరిగిరానున్నారు. సీఎం జగన్ వెంట భద్రతా అధికారులు ఎస్ఎస్‌జీ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి తదితరులు వెళ్లనున్నారు. గతంలోని ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యక్తిగత టూర్ కావడంతో పూర్తిగా తన సొంత ఖర్చులతో జగన్ వెళ్లడం విశేషం. 



అక్కడ జగన్ కుటుంబం ప్రత్యేక ప్రార్ధనలు చెయ్యబోతుంది.  ప్రతి ఏటా వైెఎస్ జగన్ కుటుంబం జెరూసలెం వెళుతుందట.. కానీ ఈసారి ఎన్నికలతో బిజీ కావడంతో పర్యటన వాయిదా పడిందట. సీఎం జగన్ మూడు ఈ మధ్యనే.. సాధారణ పాస్‌పోర్ట్ స్థానంలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను తీసుకున్నారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసుకు తన సతీమణి భారతితో వెళ్లి.. పాస్‌పోర్ట్‌ను అందుకున్ననారు. 


ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్, రాయబారులకి మాత్రమే ఈ పాస్‌పోర్ట్ జారీచేస్తారు. ఈ పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులకు విమానాశ్రయంలో నేరుగా ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు.. నేరుగా తాము వెళ్లాల్సిన విమానం వద్దకు ప్రభుత్వ వాహనంలో చేరుకోవచ్చు. ఈ పాస్‌పోర్ట్ కలిగిన ఉన్నవారు విదేశాలకు వెళ్లేటప్పుడు ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యంత ముఖ్యులుగా గౌరవిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: