ఉమ్మడి ఏపీలో కేసీయార్ ఉద్యమ వీరుడు. ఆయన మండే మధ్యాహ్న సూర్యుడు కూడా. అప్పట్లో ఏ పార్టీ కూడా ఆయన్ని కనీసం టచ్ చేసేందుకు రిస్క్ చేయని పరిస్థితి. అయితే విభజన జరిగిన తరువాత కేసీయార్ తెలంగాణాకు మంచి పాలకుడు అయ్యారు. పొరుగున ఉన్న ఏపీతో కూడా తనకు గుడ్ రిలేషన్స్ కావాలనుకున్నారు. బ్యాడ్ లక్ ఏంటి అంటే చంద్రబాబు ఇక్కడ సీఎం గా ఉండగా అది కుదరలేదు. ఇపుడు జగన్ కొత్త సీఎం అయ్యారు. మరి ఈ ఇద్దరి మధ్య స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న తీరున బంధం బిగుసుకుంది. మరి టీడీపీ చూస్తూ వూరుకుంటుందా...


అందుకే అసెంబ్లీలో నానా యాగీ చేస్తోంది. జగన్ ఏపీని తెలంగాణాకు తాకట్టు పెడుతున్నాడంటూ టీడీపీ తమ్ముళ్ళు నిప్పులు చెరుగుతున్నారు. జగన్ వద్ద వేరు శనగ పప్పు ఉంటే కేసీయర్ వద్ద ఉత్త పొట్టు మాత్రమే ఉందని, ఇద్దరు కలసి పంచుకుంటే ఏపీకే దారుణమైన నష్టమని పయ్యావుల కేశవ్ సెటైర్లు వేశారు. కేసీయార్ ఉచ్చులో పడి ఏపీని నష్టం చేస్తే వూరుకోమని సభా వేదికగా చంద్రబాబు గట్టి వార్నింగులే   ఇచ్చారు.


ఈ పరిణామాలపైన జగన్ అటు కేసీయార్ ఇద్దరూ కూడా మదింపు చేస్తున్నారుట. ఇంతలా ఏపీలో  హీటెక్కిన వాతావరణంలో ఇప్పట్లో కేసీయార్ తో చర్చలు అంటేనే జగన్ వద్దు అంటున్నాడుట.  మరో వైపు కేసీయార్ సైతం జగన్ పరిస్థితిని అర్ధం చేసుకుని ఇప్పట్లో సీఎంల  భేటీ  వద్దే  వద్దు అని  ఆయన కూడా చెబుతున్నారుట.


నిజానికి ఈ నెలాఖరులో గోదావరి జలాల మళ్ళింపు అంశంపై  జగన్, కేసీయార్ మధ్య  మీటింగు ఉంది. కానీ ఏపీలో చెలరేగిన రాజకీయ అగ్గితో మిత్రులు  ఇద్దరూ కొంత కాలం దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇపుడున్న వేడి చల్లారిన తరువాతెన ఇద్దరు సీఎంల భేటీ ఉండబోతోందని అంటున్నారు.


అధికార వర్గాల సమాచారం బట్టి చూస్తే సెప్టెంబర్లో ఇద్దరు సీఎంలు భేటీ అయి గోదావరి జలాల మళ్ళింపు ప్రతిపాదనపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయ రచ్చకు రెడీగా ఉన్న టీడీపీకి ఎటివంటి చాన్స్ ఇవ్వవద్దన్న విషయంలో అటు కేసీయార్, ఇటు జగన్ కూడా పట్టుదలగా ఉన్నారట. 


మొత్తానికి ఇప్పటికైతే చంద్రబాబు వ్యూహం సక్సెస్ అయింది. టెంపరరీగానైనా మిత్రులను కొంతకాలం కలవనీయకుండా అగ్గి పుట్టించామని టీడీపీ సంబరపడుతోంది. మరి సెప్టెంబర్ మీటింగుకు ముందు టీడీపీ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: