అసెంబ్లీలో జగన్ మాట్లాడిన తరువాత బుగ్గన స్పీచ్ కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారంటే అతిశయెక్తి కాదు. తన మాటలతో సామెతలతో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టగలిగే సామర్ధ్యం ఉన్నోడు బుగ్గన. వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఆర్దిక మంత్రిగా బుగ్గ‌న వ్య‌వ‌హ‌రిస్తార‌ని అంద‌రూ ముందు నుండే ఊహించారు. ఎందుకంటే వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ బుగ్గ‌న రాజేంద్ర నాధ్ నాటి అధికార ప‌క్షం మీద చాలా కూల్‌గా ప‌దునైన విమ‌ర్శ‌లతో చుర‌క‌లు అంటించేవారు.


ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో భూమా నాగిరెడ్డికి తొలుత జ‌గ‌న్ పీఏసీ ఛైర్మ‌న్ గా అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న వైసీపీ వ‌దిలి టీడీపీలో చేర‌టంతో..ఆ వెంట‌నే బుగ్గ‌న‌కు పీఏసీ ఛైర్మ‌న్‌గా అవ‌కాశం ఇస్తూ జ‌గ‌న్ నిర్న‌యించారు. తొలి నుండి ఇంగ్లీషు మీడియం చ‌దువులైనా అంశాల వారీగా లోతుగా అధ్య‌య‌నం చేయ‌టం.. ఏ అంశాల‌తో ఎదుటి పక్షాన్ని ఇరుకున పెట్టాలో అతి త‌క్కువ స‌మ‌యంలోనే బాగా తెలుసుకున్నారు. రాయ‌ల‌సీమ య‌స‌లో..సీమ ప్రాంత‌పు సామెత‌ల‌తో..క‌ధ‌ల‌తో.. వ్యంగాస్త్రాల‌తో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా..శాస‌న‌స‌భా వ్య‌వ‌హా రాల శాఖా మంత్రిగా ప్ర‌తిప‌క్ష టీడీపీని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్నారు.


మొత్తం జ‌గ‌న్ కేబినెట్‌లో ప్ర‌తిప‌క్షాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్న అతి త‌క్కువ మందిలో బుగ్గ‌న తొలి స్థానంలో ఉంటారు. బుగ్గ‌న స‌భ‌లో లెవ‌నెత్తే అంశాల పైన ముందుగానే పూర్తి స‌మాచారం..అవ‌గాహ‌న‌తో స‌భ‌కు వ‌స్తున్నారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన నిర్వాకాల పైన పూర్తి అధ్య‌య‌నం చేస్తున్నారు. చ‌ర్చ‌కు వ‌చ్చే ప్ర‌తీ అంశంలో గ‌త ప్ర‌భుత్వ లోపాల‌ను ముందు గానే అధ్య‌య‌నం చేయటంతో వారి విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్ట‌టానికి సులువుగా మారింది. ఇంత‌గా ఇత‌ర మంత్రులు క‌స‌ర‌త్తు చేయ‌టం లేదు. స‌భ‌లో ముఖ్య‌మంత్రి సైతం ఒక్కో సంద‌ర్భంలో ఆవేశానికి లోనైన స‌మ‌యంలో స‌భ‌ను కూల్ చేయ‌టంలో..ప‌రిస్థితిని కంట్రోల్ లోకి తేవ‌టంతో బుగ్గన ఇప్పుడు క్రియా శీల‌కంగా మారారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: