జగన్ సమైక్య సభ రచ్చరచ్చయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. హైదరాబాద్ లో సమైక్య సభకు అనుమతివ్వద్దని తెలంగాణ విద్యార్థి జేఏసి డిజిపికి ఇప్పటికే వినతి పత్రం సమర్పించింది. ఒక వేళ ఇస్తే బౌతిక దాడులకు కూడా దిగుతామని హెచ్చరించింది. ఇది చాల దన్నట్టు తాజాగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసి అద్యక్షుడు గజ్జల కాంతం కూడా జగన్ సభను అడ్డుకుంటామని ప్రకటించాడు.

దీనికి తగ్గట్టు జంట నగరాలనుంచి జన సమీకరణ ఎక్కువ చేయాలని జగన్ కుత్బుల్లాపూర్ లో పార్టీ సమావేశం పెట్టించి ప్రయత్నం ప్రారంభించిన మరుసటి రోజే టిఆర్ఎస్ జంట నగరాల నుంచి జగన్ సభకు ఎవ్వరు వెల్లద్దంటూ సమైక్య సభకు సంబందించిన జగన్ ఫ్లెక్సీలను అదే కుత్బుల్లాపూర్ లో చించివేసారు. అంతే కాదు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని, అడుగడుగునా సభకు పోయేవారిని అడ్డుకుంటామని స్పష్టం చేసారు.

దీంతో జగన్ సభపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏమూల నుంచి ఎలాంటి దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏపిఎన్జీఓల సభకు ఓకే చెప్పినప్పటికి వారిపై చెదురుమొదురు దాడులు జరిగాయి. అలాంటిది దాడులు చేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సభ ఎంతటి వయోలెన్స్ ను సృష్టిస్తుందో అంటున్నారు రాజకీయ పరిశీలకులు కూడా. సీమాంద్ర నుంచి వచ్చినా కూడా వారిని సభాస్థలికి వెల్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్రస్థాయిలో ఘర్షనలు చోటు చేసుకుని అదుపు తప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంటున్నారు. ఇది పోలీసులకు కూడా సవాల్ కానుంది, పోలీసులయితే ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు. ఇక ఎలా జరుగుతుంది అనేదే అందరిలో నెలకొన్న టెన్షన్.

మరింత సమాచారం తెలుసుకోండి: