2014 ఎన్నికల్లో జగన్ అవినీతి లక్ష కోట్లని టీడీపీ చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. జగన్ లాంటి అవినీతి పరుడెవరు లేరని టీడీపీ బాగా ప్రచారం చేసింది. ఇప్పుడు కట్ చేస్తే ఆ కేసులన్నీ ఇప్పడూ ఒక్కొక్కటిగా కొట్టేస్తున్నారు. గతి పబ్లికేషన్స్‌ ఎఫ్‌డీఆర్‌ జప్తు విషయంలో అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ఉత్తర్వులను పాక్షి కంగా సవరించింది. రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను వెంటనే జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. జగతి పబ్లికేష న్స్, రాంకీ గ్రూపు ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీల తీరును మనీ లాండరింగ్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ తప్పుపట్టింది.


ఈ మేర‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు లొ విచార‌ణ స‌మ‌యంలో అధికారుల‌కు ఒక్కొక్క‌రుగా విముక్తుల‌వుతున్నారు. ఇక‌, ప్ర‌ధానంగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ నిర్ణ‌యాల పైన తాజాగా అప్పిలేట్‌ ట్రిబ్యునల్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌గ‌న్‌కు సంబంధించిన ఆస్తుల ఎటాచ్‌మెంట్‌లో అప్పిలేట్‌ ట్రిబ్యునల్ కీల‌క ఆదేశాలు ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ గ్రూపు ఆస్తుల జప్తు విషయంలో ఈడీ.. అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీల తీరును మనీ లాండరింగ్‌ అప్పిలేట్‌ ట్రిబ్యున ల్‌ తప్పుపట్టింది. ఏకపక్షంగా ఈ జప్తులు సాగాయని పేర్కొన్నది. 


జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా.. అసలు ఈ కేసుల్లో అందుబాటులో ఉన్న ఆధారాలను తీసుకోలేదని ఈడీకి ట్రిబ్యునల్ అక్షింతలు వేసింది. రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను వెంటనే జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆ రూ.10 కోట్ల మొత్తానికి సమానమైన ఇండెమ్నిటీ బాండ్‌ను హామీగా ఈడీకి సమర్పించాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం తీర్పు వెలువ రించారు. ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఫార్మా సిటీ లోపల 50 మీటర్ల బఫర్‌ జోన్‌ను కొనసాగించాలని అప్పి లెట్‌ ట్రిబ్యునల్‌ రాంకీ ఫార్మాస్యూటికల్‌ సిటీ లిమిటెడ్‌ను ఆదేశించింది. దీని విషయంలో మాత్రం జప్తు కొనసాగుతుందని, మిగిలిన ఆస్తులను జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని తేల్చి చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: