ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తున్నారు. నారా లోకేష్ ఈరోజు చేసిన ట్విట్లలో ఒక చోటా దమ్ముంటే నిరూపించండి అని పాలకపక్షానికి సవాల్ విసిరారు. దీంతో నెటిజన్లు 'దమ్ము గురించి మీరు మాట్లాడకండి లోకేష్ గారు' అంటూ వ్యంగ్యంగా స్పందిస్తునారు. 


నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు.' అని ట్విట్ చేసి కాసేపటికి మరొక ట్విట్ చేశారు. 


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్యేశిస్తు 'తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్యది. అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించండి. లేక రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి.' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కి స్పందిస్తున్న నెటిజన్లు 'వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అనుకుంటున్నారో లేదో కానీ నువ్వు ఇంకా అధికారంలో ఉన్నావ్ అనుకుంటున్నావు. కొంచం ఫలితాలు గుర్తు తెచ్చుకోని మాట్లాడు' అని ఒకరు స్పందించారు. మరికొందరు 'నిజమే తండ్రి రాజ్యంలో ఉన్నప్పుడు మీ నాన్న (చంద్రబాబు) మీ బాలయ్య మావ తండ్రి (ఎన్టీఆర్) రాజ్యాన్ని లాక్కొని అతను తదనంతరం వారి పార్టీలోనే ఓ పదవిని చేతిలో పెట్టిన ఘనత మీ నారా కుటుంబానికే సొంతం' అంటూ ఘాటుగా స్పందించారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: