ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుడి వరుకు ప్రతి ఒకరికి న్యాయం చెయ్యాలని, ప్రజలకు మంచి జరగాలని, ప్రజలకు చెందాల్సిన సొమ్ము ప్రజలకు చేరాలని వివిధ రకాల సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. 


ఆంధ్రలో పుట్టిన ప్రతి బిడ్డకు చదువు ఉండాలని అమ్మఒడి అనే సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ విద్య గురించి సంచలన ట్విట్ చేశారు. విద్య అనేది వ్యాపారం కాదని, అది సేవ మాత్రమేనని అందుకే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి చదువులను తీసుకొస్తున్నాం అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. 


వైఎస్ జగన్ ట్విట్ చేస్తూ 'విద్య వ్యాపారం కాదు, అదొక సేవ మాత్రమే. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి చదువులను తీసుకొస్తున్నాం. రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల ఫీజులపై నియంత్రణ, మౌలిక సదుపాయాలపై పర్యవేక్షణకు కమిషన్లను ఏర్పాటుచేస్తూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించాం.' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ ని చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'రాజన్న ప్రభుత్వంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు అదే సంతోషం ప్రజల కళ్ళల్లో కనబడేలా చేస్తున్నారు అన్న మీరు. ఇంత మంచి చేస్తున్న ప్రతిపక్ష నేతలు, బీజేపీ నేతలు మీ పై మీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు, వాటిని పట్టించుకోకుండా ఆంధ్రని అభివృద్ధి వైపు నడిపించండి అన్న' అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: