ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు  ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ లో రెచ్చిపోతున్నాడు. 'బ్రాడ్ బ్యాండ్, ఫోన్, కేబుల్ ఇస్తే, వైసీపీ వాళ్ళ ఏడుపు దేనికో అర్ధం కావటం లేదు. అప్పట్లో తెదేపా ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ మొదలు పెట్టిన రెండో రోజే కేబుళ్ళు కట్ చేసారు. కోర్టుల్లో కేసులు వేసి ఆపేయించాలని కుట్రలు పన్నారు.  


అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తెదేపాకు ప్రజల్లో మంచి పేరు వచ్చేస్తుందన్న ఏడుపు ఉండొచ్చు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అవే మాటలు, అవే ఆరోపణలు చేస్తుంటే, వింటున్న ప్రజలకు మీ మీద రోత పుడుతోంది బుగ్గనగారూ. ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థతో మేము సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకున్నారు. రూ.5 వేల కోట్లు పట్టే ప్రాజెక్టును రూ. 350 కోట్లతో పూర్తి చేసిన ఘనత మాది. అవినీతి అంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదు, నిరూపించండి.


రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు. ఆయన్ను పక్కన ఉంచుకుని మా మీద ఆరోపణలు చేస్తే జనం నవ్వుతారు. మీ నేతలా ప్రజల రక్తం పీల్చే దుస్థితిలో నేను లేను. ఆధారాలు చూపించకుండా ఆరోపణలతో బ్రతికేస్తాం అంటే మీ ఇష్టం.' అంటూ ట్విట్ చేశారు నారా లోకేష్. ఈ ట్వీట్లకు కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు. 


'మీరు ఇచ్చినందుకు మాట్లాడలేదు బాబు, ఇచ్చినట్టు ఇచ్చి దానినుంచి మీరు ఎంత లాక్కున్నారు అనేదాని పై ఈ డిస్కషన్' అని ఒకరు అంటే, మరి కొందరు స్పందిస్తూ 'అధికారంలో 5 ఏళ్ళు ఉన్నపుడు ఏమీ చెయ్యలేదు, ఇప్పుడు మాత్రం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి చేసుకున్న వైసీపీ వాళ్ళపై రుద్దటానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు, దీని బట్టి తెలుస్తోంది మీరు ఎంత సమర్దులో.' అంటూ ఘాటు సమాధానాలు ఇస్తున్నారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: