ఏపీలో కాంగ్రెస్ ఒకరిద్దరు ఎమ్మెల్యేలనైనా గెలుస్తుందని ఎవరు అనుకోలేదు, చివరికి కాంగ్రెస్ కండువాలు కూడా అనుకుండవు, అయినా ఓటమికి బాధ్యత వహించవలసిందే అంటూ రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఏపీ  కాంగ్రెస్ కు కొత్త చీఫ్ ని వెతికే పనిలో పడిందట కాంగ్రెస్ హైకమాండ్. సాహసం చేయమని  ఎంతగానో ప్రోత్సహిస్తున్న సై అంటూ ముందుకొచ్చేవాళ్లు మాత్రం కనిపించట్లేదట.ఇంతకీ ఏపీలో నిండా మునిగిన కాంగ్రెస్ నావకు కొత్త కెప్టెన్ ఎవరు అవుతారు, ఏపీకి కొత్త సారథిని వెతికే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ బిజీగా ఉందట.

ఏపీలో పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని జాతీయ నాయకత్వం కల్లో కూడా ఊహించుండరు. కాకలు తీరిన యోధుడు లాంటి నేతలు విపరీతంగా పోటీ పడే స్థాయి నుంచి అధిష్ఠానమే వెతుక్కొని స్థితికి ఏపీలో కాంగ్రెస్ చేరింది.పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రఘువీరా రెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దానికి ఇంకా ఆమోదించని హైకమాండ్ రఘువీరా వారసున్ని వెతికే పనిలో బిజీగా ఉందట. ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపు కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోందట, ఉమ్మడి ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ కి దూరమైన నల్లారి తాను పెట్టుకున్న సొంత పార్టీ నిలవకపోవడంతో, తిరిగి మళ్లి కాంగ్రెస్ గూటికి చేరారు.


కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి ఆసక్తిని ప్రదర్శించలేదు అలాగే ప్రచారం కూడా చేయకుండా సైలెంట్ గానే ఉండిపోయారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి అతి త్వరలోనే కాషాయ కండువాని ధరించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో కిరణ్ ని పార్టీ మారకుండా అడ్డుకోవడం ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఈ రెండు టాస్క్ లు కూడా పిసిసి బాధ్యతలు అప్పగించడంతో నెరవేర్చినట్లు అవుతుందని హైకమాండ్ భావిస్తోందట.


కిరణ్ వైపు పార్టీ అధిష్టానం ఆసక్తిగానే ఉన్నా అసలు ఆయన మనసులో ఏముంది అన్నది మాత్రం తెలియడం లేదట. మరోవైపు మరికొందరి నేతల పేర్లు కూడా పిసిసి రేసులో వినిపిస్తున్నాయి, కనుమూరి బాపిరాజు, తులిసి రెడ్డి, చింతామోహన్, శైలజానాథ్ చుట్టూ ఆసక్తికరమైన చర్చ సాగుతుందట. కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్ఠానం ఫస్ట్ ప్రయారిటీ అని ఒక వైపు ప్రచారం సాగుతున్నా, అలాంటిదేం లేదని సీనియర్ నేతల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోందని కాంగ్రెస్ కండువాలు చెప్తున్నాయి.


అయితే వీరిలో ఎవరిని ఎంపిక చేసినా వాళ్లు ఉత్సాహంగా పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమే అని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. నిజానికి కనుమూరి బాపిరాజు నుంచి చింతా మోహన్ వరకు అందరూ పార్టీకీ వీర విధేయులే ఐతే నిండా మునిగిన పార్టీ ని లీడ్ చేసే బాధ్యతను ఎంత వరకూ తీసుకుంటారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇలా అనేక కన్ఫ్యూజన్స్ ఉండటం వల్లే రఘువీరా రెడ్డి రాజీనామాను ఆమోదించకుండా హోల్డ్ లో పెట్టినట్లు పార్టీ అధిష్టానం ఇక పై ఏపీలో పార్టీని పరుగులు పెట్టించే  పాత్రను ఏ కాంగ్రెస్ కండువా పోషిస్తుందనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: