ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులకు ఇసుక విధానం, పెండిగ్ లో ఉన్న బకాయిల గురించి పలు వివారలను తెలియజేశారు. రాష్ర్టంలో ఇసుక లభ్యతమై సీఎం జగన్ కలెక్టర్లను అడిగితెలుసుకున్నారు. ఈ మేరకు సెప్టెంబరు నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని, అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ఉంచాలని అధికారులకు సూచించారు. పారదర్శక విధానం పాటించి ఇసుక కొరత అన్నది లేకుండా చూడాలన్నారు. అవసరమైతే ర్యాంపులు తెరవండి.. వాటి సంఖ్య పెంచండి. అదే సమయంలో అవినీతి లేకుండా చూసుకోండి. ఇసుక లభ్యత లేకపోతే రేటు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది గమనించి ఇసుక సమస్యపై కచ్చితంగా దృష్టి పెట్టండి అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

మధ్యాహ్న భోజన పథకం గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘ మధ్యాహ్న భోజనం క్వాలిటీపై దృష్టిపెట్టాలి. పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ విడుదల చేయలమని ఆదేశించాను. మధ్యాహ్న భోజనం పథకానికి సరైన సమయంలో డబ్బులు ఇవ్వాలి. లేకపోతే భోజనం నాణ్యత తగ్గిపోతుంది. చెల్లింపులు సకాలంలో జరగాలి. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టిపెడుతుంది: గుడ్డు నాణ్యత బాగోలేదని నా దృష్టికి వస్తోంది. దానిపై దృష్టిపెట్టాలి. మధ్యాహ్న భోజన బాధ్యత కలెక్టర్లకే అప్పగిస్తున్నాం. పైస్థాయిలో మధ్యాహ్నభోజనంపై ఎలాంటి నిర్ణయాలు వద్దు’ అని స్పష్టం చేశారు.

ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాల గుర్తింపు తప్పనిసరి. అన్ని వసతులు ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. కంప్యూటర్ పెట్టాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. స్కానర్ ఉండాలి. ప్రింటర్ ఉండాలి. దరఖాస్తు పెట్టిన 72 గంటల్లో రేషన్ కార్డు, పెన్షన్ కార్డు ఇచ్చేట్టు ఉండాలి. గ్రామ సెక్రటేరియట్ పెట్టిన తర్వాత అడిగిన వారికి అడిగిన కార్డు ఇచ్చేట్టు ఉండాలి. ఇలా అయితేనే గ్రామ సచివాలయానికి ఒక అర్థం వస్తుంది. గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రతీ జిల్లాలో కూడా కనీసం లక్షమంది పరీక్షలు రాస్తున్నారు.  ఇంతమంది పరీక్షలు రాస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి.. వాటిని ముందుగానే గుర్తించి... ఆ సమస్యలు రాకుండా చూడాలి. కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: