ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మళ్ళి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ పాలనా తుగ్లక్ పాలనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకా 16 లక్షల భావన నిర్మాణాలు ఆగిపోయాయని, 1500 రూపాయిల ట్రాక్టర్ ఇసుక 10 వేల రూపాయలకు చేరిందని అయన వ్యాఖ్యానించారు. కూలీలు రోజుకు 500 రూపాయలు అప్పు చేసి జీవనం గడిపిస్తున్నారని గత 60 రోజులుగా ఇలాగే వారు అప్పులు చేస్తున్నారని అయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 


అయితే ఈ ట్విట్లను చుసిన నెటిజన్లు నారా లోకేష్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయన ట్విట్ చేసే విధానాన్ని మార్చుకోవాలని లేకుంటే రాజకీయాలలోకి రావడం కష్టమేనని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. ఒక కార్మికుడు రోజుకు 500 స్పదిస్తాడు కానీ ఖర్చు చెయ్యడు, కార్మికులు అప్పుల చేస్తున్నారని ఏ ఆధారంతో మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: