రాజ‌కీయ నాయ‌కుల్లో మ‌రో ప్ర‌ముఖుడి కుటుంబానికి షాక్ త‌గిలింది. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పురికి చెందిన రూ.254 కోట్ల విలువైన బినామీ షేర్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం జప్తు చేశారు. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాకేశ్‌ సక్సేనాను దర్యాప్తు సంస్థలు ఇటీవల దుబాయ్‌ నుంచి భారత్‌కు రప్పించారు. ఆయనను ప్రశ్నించిన దర్యాప్తు సంస్థలు, ముడుపుల మళ్లింపులో రతుల్‌ పురి పాత్ర ఉన్నట్లు ఆరోపించాయి. రాకేశ్‌ సక్సేనాకు రతుల్‌ పురి తరుఫున నిధులు అందాయని, షెల్‌ కంపెనీ ద్వారా వాటిని భారత్‌కు మళ్లించినట్లు పేర్కొన్నాయి.


వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆయనకు విదేశాల నుంచి ముడుపులు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. హిందూస్థాన్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(హెచ్‌పీపీ) చైర్మన్‌ అయిన రతుల్‌ పురిపై వచ్చిన పన్ను ఎగవేత, మనీల్యాండరింగ్‌ ఆరోపణలపై ఐటీ శాఖతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి. అయితే, ఈ ద‌ర్యాప్తు స‌మ‌యంలోనే...క‌మ‌ల్‌నాథ్ మేన‌ల్లుడు బాత్రూంనుంచి పారిపోయాడు.అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరైనట్టే హాజరై.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు, వ్యాపారి రతుల్ పురి తమ కన్నుగప్పి కార్యాలయం నుంచి వెళ్ళిపోయినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆరోపించారురు. ఈ కేసులో శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ రతుల్ పురికి ఇదివరకే సమన్లు జారీచేసింది. అయితే, విచారణకు హాజరైన రతుల్ పురి బాత్‌రూమ్‌కు వెళ్లాలంటూ కొద్దిపాటి విరామం తీసుకున్నారు. అయితే, ఆయన అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయారని, మొబైల్‌ను కూడా స్విచ్ఛాప్ చేసి పెట్టుకున్నారని ఈడీ అధికారులు తెలిపారు. 


ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే క‌మ‌ల్‌నాథ్‌కు సైతం ఇదే త‌ర‌హా షాక్ త‌గిలింది. గ‌త మే నెల‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుటుంబ నిర్వహణలోని కళాశాలకు జరిగిన భూ కేటాయింపులను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రద్దు చేసింది. 1970వ దశకంలో కమల్‌నాథ్ తండ్రి మహేంద్రనాథ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)ని స్థాపించారు. ఈ సంస్థ ప్రస్తుతం దేశంలోని ప్రైవేట్ బీ స్కూళ్లలో ఉన్నత ర్యాంకు పొందింది. ప్రస్తుతం సంస్థకు కమల్‌నాథ్ తనయుడు బకుల్‌నాథ్ సారథ్యం వహిస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్ రాజేంద్ర త్యాగి ఫిర్యాదుపై స్పందించిన ఘజియాబాద్ అభివృద్ధి సంస్థ (జీడీఏ).. ఐఎంటీకి కేటాయించిన 10,841 చదరపు మీటర్ల స్థలం కేటాయింపును రద్దు చేసింది. 1973లో ఐఎంటీకి అప్పటి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ ఈ భూమిని కేటాయించింది. ఢిల్లీకి కేవలం కొన్ని మైళ్ల దూరంలోని విలువైన 15 ఎకరాల భూమిని ఐఎంటీ యజమానులు మోసపూరితంగా పొందారని త్యాగి ఆరోపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: