గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి కూడా పెరుగుతుంది. ప్రస్తుతం  సీలేరు నుంచి అదే విధంగా శబరి, ఇంద్రావతి నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గోదావరి వద్ద వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద ఉధృతి వస్తున్న నేపధ్యంలో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను కూడా ఎత్తివేసి గోదావరి జలాలను సముద్రంలోకి వృధాగా విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం 4,70,000 క్యూసెక్యుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 8.9 అడుగుల నీటి మట్టం ఉంది. అంటే సాధారణంగా 11 అడుగుల నీటి మట్టం మెయింటెయిన్ చేస్తారు ఇక్కడ. అంటే ఇన్ఫ్లో బాగా పెరగటం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు రావడం వల్ల 8 అడుగుల నీటి మట్టం మెయింటెన్ చేస్తూ మొత్తం వచ్చిన నీటిని వచ్చినట్లుగా సముద్రంలోకి వృధాగా విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరమ్మ పరవళ్లు తొక్కుతుంది. చత్తీస్ గఢ్,ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల అక్కడ శబరి నదికి వరద పోటెత్తింది.

శబరి నది నుంచి నేరుగా గోదావరిలోకి వరద నీరు కలవడం వల్ల మరో పక్కన ఇంద్రావతి నుంచి కూడా భారీ స్థాయిలో వరద నీరు పెరగడం వల్ల గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికే ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజి ఎగువ భాగాన ఆ పోలవరం కాపర్ డ్యాం సమీపంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బందంలో చిక్కుకునే ప్రమాదం ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆ కాపర్ డ్యామ్ కు సంబంధించి అంటే పోలవరం లోతట్టు గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుమారు 30 గ్రామాలు జలమయమయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు.


మరో పక్క విలీన మండలాలో శబరి నది పొంగి ప్రవహించడం వల్ల రహదారుల్లో వరద ప్రవహిస్తుంది. చింతూరు, విఆర్ పురం మండలాల్లో సుమారుగా 30 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపొయాయి. జన జీవనం స్థంబించింది. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ రోజు సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా గోదావరి వరద ఉధృతి పెరగడం వల్ల గోదావరిలో పాపికొండల విహార యాత్రను, నాటు పడవల రాకపోకలను పూర్తిగా నిలిపివేసారు. తూర్పుగోదావరి జిల్లా అంతటికీ గోదావరిలో ఇక్కడ రాజమండ్రి నుంచే ఇసుక తరలించే పరిస్థితి ఉంటాయంటే గోదావరిలో నుంచి నదీ జలాల నుంచి ఇసుకను తీసుకు వచ్చి సరఫరా చేస్తారు. ప్రస్తుతం గత 2 రోజులుగా కూడా ఇసుక సరఫరా కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా చూస్తే గనుక ఈ రోజు సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విలీన మండలాలలో చాలా గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. చింతూరు, విఆర్ పురం మండలం మద్య రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో జలకళ అంటే ఏజెన్సీ ప్రాంతాల వర్షాల్లేక చెరువులన్నీ ఎండిపోయిన పరిస్థితి. ఇప్పుడయితే కనుక జలకళ సంతరించుకుంది. భూపతిపాలెం రిజర్వాయర్ లో ఇక్కడ పూర్తిగా వర్షపు నీరు చేరుకోవడంతో భూపతిపాలెం రిజర్వాయర్ కూడా జలకళతో సందడిగా నెలకొంది. మరో పక్క చూస్తే కనుక ఈ గోదావరి వరద ఉధృతికి రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ప్రతి రోజూ గోదావరికి నిత్య హారతి ఇచ్చే బంటు కూడా రాత్రి ఇక్కడ గోదావరిలో కొట్టుకు వచ్చింది.

ధవళేశ్వరం బ్యారేజి వద్ద 29వ గేటు వద్ద కూడా ఇక్కడ చిక్కకోవటంతో బంటును కూడా ఇరిగేషన్ అధికారులు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. మొత్తానికి చూస్తే గనక ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని, ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: