ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వైఎస్ జగన్మోహన్ రెడ్డి' ట్విట్టర్ వేధికగా పరీక్షలకు హాజరయ్యే వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ సంచలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేరు తెచ్చుకున్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటికొకటి అమలు చేస్తూ వస్తున్నారు. 


పుట్టిన పాప నుంచి వయో వృద్ధుడి వరుకు ప్రతిఒక్కరికి ఉపయోగా పడే పథకాలను అమలు చేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగా కల్పనా కోసం గ్రామా వాలుంటెర్ ఉద్యోగాలను, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. 


దీంతో ఈ ఉద్యోగాల కోసం కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూసి ఆశ్చర్యపోయి ట్విట్టర్ వేధికగా స్పందించారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ 'గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు అనూహ్య స్పందన వస్తోంది. నిన్న ఒక్కరోజే 1.34లక్షల మందికిపైగా, మొత్తంగా ఈరోజు సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. పరీక్షలకు హాజరవుతున్న వారందరికీ ఆల్‌ ద బెస్ట్.' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కు స్పందిస్తున్న నెటిజన్లలో కొంతమంది ఇంటర్ విద్యార్థులు 'జగన్ అన్న మీ గెలుపు కోసం మా ఇంటర్ విద్యార్థులు కూడా ఎంతో కష్టపడ్డాము అని' ఇంటర్ వారికీ కూడా అవకాశం ఇవ్వండి అంటూ ట్విట్లు చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: