దశాబ్దాల చరిత్ర గల ఈ ఆయుర్వేద హాస్పిటల్ను చార్మినార్ నుంచి ఎర్రగడ్డకు షిఫ్ట్ చేయాలని చెప్పి గవర్న్మెంట్ నిర్ణయం తీసుకుంది.దీని వలన ఇక్కడున్న స్టూడెంట్స్ మరియు డాక్టర్స్ అందరూ కూడా గత మూడు రోజుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకాన్ని వ్యక్తం చేస్తు, ధర్నా చేస్తున్నారు.దీనిపై పోలీసులు చర్యలు తీసుకొని ధర్నా చేస్తున్న విధ్యార్దులపై కానిస్టేబుల్ ధాడికి పాల్పడారు. ఈ ధాడిలో ఒక స్టూడెంట్ తో కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించారు.ఈ దారుణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఇప్పటికే సౌత్ జోన్ డిస్ట్రిక్ట్ను ఆదేశించడం జరిగింది.


దీంతో ఆ కానిస్టేబుల్ ని ఐడెంటిఫై చేసి అతనిమీద చర్యలు తీసుకుంటామంటూ,ఈ సౌత్ జోన్ డిస్ట్రిక్ట్  మీడియా మీడియాతో సమావేసమై మీడియా సమక్షంలో వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి. సౌత్ జోన్ డిస్ట్రిక్ట్ నుంచి సమాచారం అందిన ప్రకారం ఎవరైతే ఈ సిగ్గు పాటు చర్యకు పాల్పడ్డాడో అంటే ఇతర పోలీసులు సిగ్గు పడే విధంగా వ్యవహరించాడో అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ తో పాటు డిజిపి మహేందర్ రెడ్డి కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారని తెలుస్తుంది.


వీటన్నిటి నేపథ్యంలో అతనిమీద చర్యలు తీసుకుంటాం అని, సౌత్ జోన్ లోని వివిధ పోలీసు స్టేషన్ లోని కానిస్టేబుల్ ను పిలిపించడం జరిగింది. చార్మినార్ పోలీసులే కాకుండా ఆ చుట్టు పక్కల పోలీస్ స్టేషన్ ల నుంచి కూడా అక్కడ ధర్నా జరుగుతుందని, కంట్రోల్ చేయాలి అని చెప్పి వారికి పిలుపిచ్చారు.అక్కడికే పిలుపిచ్చిన నేపథ్యంలోనే ఆ వచ్చిన కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించటం పోలీసులు తలదించుకునే విధంగా వ్యవహరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టిస్తుంది. పోలీసులు,ఉన్నత అధికారులంతా కూడా తీరని బాధని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: