ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న యాప్ ల లో ట్రూ కాలర్ కూడా ఒకటి. ట్రూకాలర్ మాగ్జిమమ్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ గురించి తెలిసే ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనకు కాల్ చేసిన వ్యక్తులెవరో తెలుసుకోవడం చాలా సులువుగా మారింది. కానీ ఈ మధ్య ట్రూ కాలర్ యాప్ కొంప ముంచుతోందంట వివరాల్లోకి వెలితే. ఈ యాప్ ద్వారా  అవతలి వ్యక్తులెవరో తెలుసుకునేందుకు వాడుతుంటే ఇదే అదనుగా పర్సనల్ డేటా పూర్తిగా హ్యాక్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు టెక్నికల్ ఎక్స్ పర్ట్స్. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనం ఫోన్ ట్రాప్ లో పడ్డట్టే.



ట్రూ కాలర్ యాప్ మొబైల్ యూజర్ లకు కాల్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవటానికి సరి కొత్త ఆప్షన్ గా తీసుకుంటున్నారు. గుర్తు తెలియని కాల్స్ తెలుసుకునే ప్రయత్నంలో రోజురోజుకి ఈ యాప్ కు యూజర్ లు పెరిగిపోతున్నారు. లాభం చాటు మోసం కూడా జరుగుతుందట నమ్మకపోయినా ఇది వాస్తవం అంటున్నారు మొబైల్ నిపుణులూ. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవటానికే యూజర్స్ తమ పర్సనల్ డేటాను అప్ లోడ్ చేస్తారు. ఇదే ఇప్పుడు కొంపముంచుతున్న విషయం. బ్యాంక్ ఖాతాలతో సహా అన్ని వివరాలు నెట్ లోకి చేరుతున్నాయట. దీంతో క్షణాల్లో డబ్బులు కాజేస్తున్నట్టుగా తాజా సర్వేలో వెల్లడైంది. అంతేకాదు ఈ యాప్ యూజర్ల మొబైల్ ఫోన్ లోని పర్సనల్ డేటాను కూడా ట్రాప్ చేస్తున్నట్టుగా సర్వే లో వెల్లడైంది.


ఇప్పటికే కుప్పలతెప్పలగా పుట్టుకొస్తున్న మొబైల్ యాప్స్ పై ప్రజలందరికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయితే వీటివల్ల ఉపయోగం ఏమో కానీ నష్టాలు ఉన్నాయనే విషయం తెలుసుకొని అప్రమత్తంగా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు . తాజాగా వెలుగు చూసిన కొన్ని ట్రూకాలర్ చాట్ ట్రాప్స్ సెల్ ఫోన్ యూజర్స్ ను కలవరపెడుతున్నాయి.అసలు ట్రూ కాలర్ యాప్ ఏంటీ దానివల్ల కలిగే నష్టాలు ఏంటీ అనుకుంటున్నారా  ఎందుకంటే ఒక అన్నౌన్ పర్సన్ కాల్ చేసినప్పుడు అతని పేరు అలాగే అతను ఈ మెయిల్ ఐడీ అట్లాగే అతని ఫోటోను కూడా తెలుసుకోడానికి ఈ ట్రూకాలర్ ను ఉపయోగిస్తుంటారు.


కానీ, ట్రూ కాలర్ లో డేటా చోరీ అయినట్టుగా మనకు ఈ మధ్య తెలుస్తుంది. దానికి సంభందించి  ఒకతను తన పేరు ట్రూకాలర్ ఎలా ఉందో తనకు అలాగే యస్ యం యస్ లు వస్తున్నాయని చెప్తున్నాడు. సో దానితో అనుమానాలు బలపడుతున్నాయి.  10 కోట్ల మంది భారతీయులు వాడుతున్న  ట్రూకాలర్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్ లను చూస్తే కనుక 60 పర్సెంట్ యూజర్స్ ఇండియా నుండి ఉండటం గమనార్హం.అంటే ట్రూకాలర్ మిగతా ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే ఇండియన్ యూజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు.కచ్చితం గా ట్రూకాలర్ ఒక మంచి సర్వీసని దీని ద్వారా బెటర్ ఆప్షన్స్ ను పొందవచ్చని మనకు తెలిసిన విషయమే.


తాజాగా  ట్రూ కాలర్ లో మనకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే యూసర్లకు  తెలీకుండానే వారికి  సంబంధించి యూపీఐ ఐడీని ట్రాప్ చేయడమే కాక ఆటోమేటిగ్గా వాళ్ల  ఆమోదం లేకుండా క్రియేట్ చేస్తున్నారని ఆరోపణ ఉంది. ఇలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు అలాగే డేటా సెక్యూరిటీ ప్రైవసీ గురించి ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా డేటా అనేది పోగొట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా యూజర్ తన వివరాలను పోగొట్టుకున్నట్టే. ఇలాంటివి జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలూ ఈ సంస్థ సమస్యల మీద కఠినతరమైన చర్యలు తీసుకునే విధంగా మెకానిజం తీసుకురాగలిగితే కనక యూజర్ డేటాను సేఫ్ గా ఉంటుంది అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వెల్లడిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: