జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో  నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ప్ర‌ధాన ముద్దాయిగా అప్పటి అధికారులు తేల్చి చెప్పారు.  అయితే  జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో మరియు ఆయన భార్య  వై ఎస్ భారతి ఆస్తులకు  సంబంధించి ఈడీ వేసిన కేసుల విషయంలో  కోర్టు  తప్పుబట్టిన విషయం తెలిసిందే. కానీ  నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌ని  మాత్రం సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారు.  ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో బ‌డా వ్యాపార వేత్త‌గా పేరున్న నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ఆదాయానికి మించి  అక్ర‌మాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. ప్ర‌స్తుతం బెయిల్‌ పై బ‌య‌ట తిరుగుతున్న నిమ్మ‌గ‌డ్డ  ఇటీవ‌ల వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల సెర్బియా దేశం వెళ్లారు. సెర్బియా రాజ‌ధాని బెల్‌ గ్రేడ్‌ విమానాశ్ర‌యంలోనే నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌ను ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం వెనుక ఏవో రాజకీయ కారణాలు ఉన్నాయట. నిజానికి నిమ్మ‌గ‌డ్డ‌ పై గ‌త కొంత కాలంగా వాన్‌ పిక్ పోర్ట్ కుంభ‌కోణం కూడా ప్రచారంలో వుంది. 


ఇందులో జ‌గ‌న్ కు కూడా భాగ‌స్వామ్యం వుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం కూడా జ‌రిగింది. వైఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలోనే ప్ర‌కాశం జిల్లా వాన్‌పిక్ పోర్ట్ కోసం భూముల్ని కేటాయించడం జరిగింది. ఇది పెద్ద కుంభ‌కోణం అని జాతీయ మీడియా నిగ్గుతేల్చింది.  నిమ్మ‌గ‌డ్డ‌ను న‌మ్మి వాన్‌పిక్ పోర్ట్ ప్రాజెక్ట్ లో వేల కోట్లు పెట్టుబ‌డి పెట్టింది  ర‌స్ ఆల్ ఖైమా.  గ‌త కొన్నేళ్లుగా ఈ వ్య‌వ‌హారం ఎటూ తేల‌క‌పోవండ‌తో నిమ్మ‌గ‌డ్డ‌ పై కేసు పెట్టింది. దీంతో ఇంట‌ర్‌పోల్ అధికారులు నిమ్మ‌గ‌డ్డ‌కు రెడ్ కార్న‌ర్ నోటీసులిచ్చారు.  ఆ కార‌ణంగానే దేశం విడిచి ప‌రాయి దేశంలో దొర‌క‌డంతో  సెర్బియా పోలీసులు నిమ్మ‌గ‌డ్డ‌ను అదుపులోకి తీసుకున్నారు.  అది ఇది దేశ వ్యాప్తంగా వైరల్ అవ్వడంతో జగన్ కేసులు గురించి కూడా లేటెస్ట్ గా అందరికీ  మళ్లీ గుర్తు చేసినట్లు అయింది. 


మొత్తానికి నిమ్మ‌గ‌డ్డ‌ను సెర్బియా పోలీసుల పుంచి విడిపించ‌క‌పోతే వైఎస్‌. జ‌గ‌న్‌ కి రాజకీయ పరంగా నష్టం కలిగేలానే ఉంది. అసలు జగన్ అండ ఉన్ననిమ్మ‌గ‌డ్డను ఎందుకు అరెస్ట్ చేసారో..? దీని వెనుక ఎవరు ఉన్నారు ?  అందుకే ఇప్పటికే  నిమ్మ‌గ‌డ్డ‌ను విడిచిపెట్టేలా తగిన చర్యలను తీసుకోవాలని జగన్, న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ ను  కోరారు.  ఈ విషయం పై  మంత్రికి విన‌తి ప‌త్రాన్ని కూడా పంపించాడు. అయితే అదును కోసం చూస్తోన్న బీజేపీ దీన్ని అంత తేలిగ్గా వదులుతుంది. జగన్ ను ముంచటానికి నిమ్మగడ్డ పావు అవుతారా..  అయినా ఆశ్చర్యపొక్కర్లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: