అసలు దేశంలో పరిశ్రమలేమయిపోయినవి ఎక్కడొస్తున్నాయి. ఇవి సాధారణంగా మనకేంటంటే ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళేమో బానే వుందనుకుంటారు. ఎదగాలనుకున్నటువంటోల్లేమో మాకు అవకాశాలు లేవని ఫీలవుతుంటారు. అదే సందర్భంలో విదేశాలలో ఉన్నటువంటి వాళ్లు ఇక్కడ ఏం జరుగుతుందనేది చూస్తుంటారు. ఇక్కడ మేకిన్ ఇండియా అనేటువంటిది స్టార్టైంది. స్టార్టయి దాదాపుగ నాలుగైదేళ్లు నడుస్తున్నది. ఈ సందర్భంలో అసలు విదేశాల నుండి పెట్టుబడులు ఏమి రావట్లేదనేది ప్రతిపక్షాలన్నీ చేసిపెట్టేటటువంటి విమర్శ. నిజమా కాదా అంటే నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.


ఎక్కడో అక్కర్లేదు మన కియాని వెంటనే మా చంద్రబాబు గారు చేశారు.అది అంతర్జాతీయంగా ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారు.అది కూడా అభినందిద్దాం. అదే సందర్భంలో మేడి హబ్ విశాఖపట్నంలో 250 మెడికల్ మ్యానిఫ్యాక్చరింగ్ ఇండస్ర్టీస్ ఇంజెక్షన్ సూది నుండి క్యాన్సర్ డిటెక్టెడ్ మిషన్స్ దాకా అన్నిటిని కూడా అక్కడే మేన్యు ఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇట్లాంటి రకాలైనటువంటి పరిశ్రమలొస్తున్నాయి. ఇట్లా ఇంకో పక్కన మేకిన్ ఇండియాలో భాగంగా మనం ఆయుధాల తయారీలు ఇట్లాంటివి కూడా చేస్తున్నాము. ఇవి కూడా ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. అయితే ఇవన్నీటిని పత్రికలకు వచ్చేటువంటి నేషనల్ పత్రికల్లో అక్కడక్కడ ప్రొజెక్టు అవుతున్నాయి కానీ మన దగ్గర ఏమి లేవన్నట్టు ఉంటాయి.


ప్రస్తుతమున్నటువంటి తాజా రికార్డుల ప్రకారం చూస్తే భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించినాయి. 201314 వరకు మన దగ్గర 36.05 బిలియన్ డాలర్ ల పెట్టుబడులు వచ్చినాయి.ఎఫ్ డిఐల రూపంలో అప్పటి నుండి ఈ 2018-19 వరకు తాజాగా విడుదలైనటువంటి నివేదిక ప్రకారం 64.37 బిలియన్ డాలర్ ల పెట్టుబడులు వచ్చినాయి. ఈ అయిదేళ్ళల్లో దాదాపుగా 80 శాతం నుంచి 90 శాతం పెరిగినవి. ఇక్కడతో సరిపోతుందంటే చాలదు ఇంకా చాలా పెరగాల్సి ఉంది వివిధ రకాల రూపాల్లో పెరగాల్సినటువంటి అవసరముంది బట్, భారతదేశపు మార్కెట్ అనేటువంటిది ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. ఒక జీఎస్టీ లాంటి సిస్టమ్స్ చేయటం వలన అట్లాగే అంతర్జాతీయ సమాజం ముందు దేశపు పరువు పెంచుకోవడం వల్ల ఇక్కడ పరువుప్రతిష్ఠలతో కూడా ముడిపడి ఉంటాయి. ఇది సాధారణంగా మన దేశానికి పెట్టుబడులు రాకుండా చెయ్యడానికి విదేశాలు చేసేటువంటి కుట్ర.



అమెరికా, చైనా, బ్రిటన్, చైనా, రష్యాలు అయిన వాళ్ళ వాళ్ళ దేశాలు చేసే కుట్ర ఏంటంటే ఇండియాకి పోతే ఎప్పుడూ ఉగ్రవాద దాడులు జరుగుతుంటాయి.ఇక్కడ జరిగినదాంట్లో 10 మంది చనిపోయిన దాన్ని రోజుల తరబడి మనం చూపెడుతుంటాం. పెట్టుబడి పెట్టటానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొని వద్దామనుకుంటే ఎవరైన ఇక్కడ ఎప్పుడు పేల్తదో తెలియదన్నప్పుడు ఏముంటది ఇదే పాకిస్థాన్ చేసే ప్రయత్నం దానికి వాళ్లందరు సహకరించారు. మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ తక్కువకే మనుషులు దొరుకుతారు. అక్కడ 10 లక్షల రూపాయల జీతం ఇస్తే ఇక్కడ 50,000, లక్ష రూపాయలకే దొరుకుతారు. ఇక్కడ గనుక అది గ్రహించేస్తే ఆయా దేశాలకి సంబంధించినటువంటి జనరేషన్స్ అందరు పరిగెత్తుకుంటూ ఇక్కడకే వచ్చేస్తారు. వాళ్ల ఖర్చులు పరంగా చూసుకున్న వాళ్లకు అక్కడ కోటి రూపాయల అయ్యేది మనకిక్కడ 15,20 లక్షలతోనే అయిపోతోంది.


అలా గనుక ఇక్కడికి తీసుకొచ్చేసుకుంటే క్రమంగా వాళ్లు దెబ్బతింటారు కాబట్టి భారతదేశం గురించి ఎప్పుడూ నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ వస్తుంటారు. దానికీ సహకరించేటువంటిదంటే పరోక్ష సహకారం డైరెక్ట్ గా ఆ దేశాలతో డబ్బు తీసుకుంటారు. మనకిక్కడ పౌరహక్కులూ, మానవ హక్కుల పేరుతో మేధావులు చేసేటువంటి పనేంటంటే చిన్నదాన్నీ భూతద్దం చేసి చూపించటం.  అమెరికాలో రోజూ కాల్పులు జరుగుతుంటాయి అక్కడ ఎంతో మంది చనిపోతుంటారు. ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళ దేశంలో సేఫ్టి లేదని చెప్పి ఎవడు ప్రచారం చేయరు. అక్కడ ఏ మేథావులు రోడ్లమీదకొచ్చి చేయరు. చర్చలు దగ్గరనో అక్కడక్కడనో నడుస్తూ ఉంటుంది. అంతేగానీ అమెరికా నాట్ సేఫ్, ఇతర మతాల వాళ్ళు, ఇతర కులాలోళ్ళు బ్రతకలేరు అనేది అక్కడ చెయ్యదు అంతర్జాతీయ సమాజం.అమెరికన్ మీడియా కూడా అట్లా చేయదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి హక్కుల నేతలు కూడా అట్లా చేయరు.



కాని మన దగ్గరున్నటువంటి వాళ్లు అట్లా చేస్తుంటారు. దానివలన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆగిపోతూ ఉంటుంటాయి. అట్లాంటి సందర్భంలో లేదు మా దగ్గరున్నటువంటి సిస్టమ్స్ ఎట్లున్నాయనేటువంటి దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండాలన్నది ఇప్పుడు కొంతవరకు ఫలితం వచ్చింది.ఇది ఇంకా భారీ ఫలితం రావాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి శరవేగంగా పుంజుకోవాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారం ఒకవైపున సమస్య ఒకటి పోతే ఒకటి వస్తూనే వుంటాయి. దాని మీద కాన్సన్ట్రేషన్ తో మనం డైవర్షన్ కాకుండా జరుగుతున్న డెవలప్మెంట్ మీద డిస్కషన్ రావల్సినటువంటి అవసరముంది.మన దేశానికి సంబంధించిన పాజిటివ్ థింక్స్ కంటే కూడా ఇక్కడ మనకే మన ప్రాంతీయ పార్టీల మీద ప్రేమ, అభిమానం మన నాయకులే అసలు ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించగలరనేటువంటి విపరీతం అయినటువంటి పిచ్చి వ్యామోహంతో ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: