ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఈరోజు ట్విట్టర్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా మాట తప్పిన వైఎస్ జగన్ అంటూ వ్యాఖ్యానించారు. 


సున్నా వడ్డీ రుణాలు అంటూ రైతులను మోసం చెయ్యబోయి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సున్నా అయ్యారు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాబు నాయుడు గారి హయాంలో మేమిచ్చాం' అని తెదేపా అంటే.. 'ఇవ్వలేదని రుజువుచేస్తే రాజీనామా చేస్తారా?' అని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేశారు జగన్ గారు. 


కానీ మరుసటిరోజే తన నోటితోనే తెదేపా హయాంలో రూ.630కోట్ల వడ్డీలేని రుణాలను రైతులకు ఇవ్వడం జరిగిందని జగన్ గారు ఒప్పుకున్నారు. ఇంతాచేసి.. రూ.3,500కోట్లతో వడ్డీలేని రుణాలు అన్న పెద్దమనిషి, బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు కేటాయించారు. జగన్ గారి మాట మార్చడం, మడమ తిప్పడం ఇలా ఉంటుందన్న మాట.' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కి స్పందిస్తున్న నెటిజన్లు నారా లోకేష్ పై ఫైర్ అవుతున్నారు. 'మీరు రెండు నెలల పాలనలో అన్గాన్ని పనులు ఎలా చేస్తారు అనుకుంటున్నారు ? 5 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరే ఒక్క పని కూడా సక్రమంగా చెయ్యలేదు. అలాంటి మీరు రెండు నెలల్లో ఆంధ్రకి అభివృద్ధి లేదని ఎలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంచం ఆగండి ఆంధ్ర అభివృద్ధి అయితే ఎలా ఉంటుందో చూద్దురు' అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: