పోలవరం ప్రాజక్ట్ విషయం రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది .పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపి వేసి సైట్ నుంచి యంత్ర సామాగ్రిని తీసుకువెళ్లిపోవాలనే  స్పిల్ వే  పనులు చేపడుతున్న నవయుగ కాంట్రాక్టు సంస్థకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరంపై నిపుణుల కమిటీని నియమించారు ఆ కమిటీ రెండు దఫాలుగా నివేదికలిచ్చింది.



ఆ నివేదికల ప్రకారం పోలవరం కాంట్రాక్టు నియామకంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా నవయుగ కంపెనీ పనులు నిలిపి వేయాలని ఆదేశించారు. హైడల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు కూడా నవయుగకే ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి కూడా వైదొలగాలని నవయుగకు ఏపీ జెన్ కో నోటీసులు జారీ చేసింది. నిపుణుల కమిటీ ఆధారంగా పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లబోతున్నామని అసెంబ్లీ లోనే అధికారికంగా ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.



ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలన్నీ అతిక్రమించారని, మూడు కోట్ల నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు అదనంగా చెల్లింపులు జరిగాయంటూ ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ ల కమిటీ రెండు దఫాలుగా నివేదిలు సమర్పించింది. ప్రస్తుత వ్యవస్థతో కాకుండా కొత్త కాంట్రాక్టు సంస్థలచే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర జలశక్తి సంస్థ అనుమతి రాగానే రివర్స్ ట్యాంపరింగ్ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. నిజానికి నవయుగ కంపెనీకి పనులు అప్పగించింది కేంద్ర ప్రభుత్వమే, కానీ రెండు వేల పదమూడు లో హెడ్ వర్క్స్ పనులను కోట్లకు ట్రాన్స్ ట్రాయ్ పనులు దక్కించుకుంది.



కానీ పనులు చేయలేకపోయింది ఎంత వేగంగా పోలవరం పూర్తి చేస్తే అంత మంచిదని భావించిన ఏపీ సర్కార్ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని తప్పించి కొత్త కాంట్రాక్టర్ లను పిలవాలనుకుంది. కానీ పాత అంచనాలతో ఇతర కాంట్రాక్టర్ లు ముందుకు వచ్చే పరిస్థితి లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ భావించింది. అందుకే ఏపీ సర్కారు పిలిచిన టెండర్ లను కూడా అప్పటి కేంద్ర మంత్రి గడ్కరి నిలిపివేయించారు .పనులు ఆగకుండా ఉండేలా ట్రాన్స్ ట్రాయ్ కు సిక్స్టీ సీ నిబంధన కింద నోటీసులిచ్చి పనులను వర్గీకరించి ఇతర కంపెనీలకి ఇచ్చారు. ఇలా హెడ్ వర్క్స్ పనులను నవయుగ దక్కించుకుంది అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: