విస్తరణ కాంక్షతో ఉన్న బిజెపిని తెలుగు రాష్ట్రాల్లో ఎదగనీయకుండా ఉమ్మడి ప్రణాళిక అమలు చేయాలని కెసియార్, జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని సమాచారం.  ఈ విషయంపై  ఎల్లో మీడియా ప్రముఖ కథనాన్ని ఇచ్చింది లేండి. దేశంలోని ఒక్కో రాష్ట్రాన్ని బిజెపి కబళిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడైతే అస్ధిర ప్రభుత్వాలున్నయో అక్కడల్లా బిజెపి చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటోంది. తాజాగా కర్నాటకలో ఏం జరిగిందో అందరూ చూసిందే.

 

తొందరలోనే తెలంగాణాలో కెసియార్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలతో కెసియార్ ముందుగా అప్రమత్తమయ్యారు.  గురువారం ఇద్దరు సిఎంలు దాదాపు మూడు గంటలు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆ సమయంలోనే బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేసే అంశం ప్రధానంగా చర్చ జరిగిందట.

 

మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో బిజెపి అనూహ్యంగా నాలుగు ఎంపి స్ధానాల్లో గెలిచింది. అదే సమయంలో కేంద్రంలో కూడా మంచి మెజారిటితో నరేంద్రమోడినే రెండోసారి అధికారంలోకి వచ్చారు. దాంతో తెలంగాణాలో బిజెపి నేతలను పట్టటం సాధ్యం కావటం లేదు. ఎప్పుడెపుడు కెసియార్ ప్రభుత్వాన్ని కూల్చేద్దామా ? అన్నంత ఆతృతలో బిజెపి నేతలున్నారు. ఇప్పటికే కొందరు టిఆర్ఎస్ నేతలు బిజెపిలో చేరటంతో కెసియార్ కూడా టెన్షన్లో పడ్డారు.

 

సరే ఇప్పటికిపుడు ఏపిలో జగన్ కు వచ్చే భయం ఏమీలేదు. ఎందుకంటే ఏపిలో బిజెపికి అసలు అడుగు పెట్టే అవకాశం కూడా రావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లశాతం 0.84 మాత్రమే. జగన్ పాలన కాస్త బ్యాలెన్సుడుగా జరిగితే చాలు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ కు తిరుగుండదు. కానీ జగన్ పై ఉన్న కేసులను బిజెపి అవకాశంగా తీసుకుని ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే అవకాశాలున్నాయి. అందుకే ఇద్దరూ కలిసి బిజెపికి చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: