షరియా చట్టం ప్రకారం పెళ్ళికిముందు శృంగారంలో పాల్గొనకూడదనే  చట్టాన్ని ఇండోనేషియా  దేశం అమలుచేసింది. అలా పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొన్నా  కఠిన చెర్యలు తప్పవని అధికారులు  హెచ్చరించారు. అయినా కొంత మంది ఆ చట్టాన్ని ఉల్లంఘించి  పెళ్లి కి ముందు శృంగారంలో పాల్గొంటున్నారు.  తాజాగా షరియా చట్టాలను ఉల్లంఘిస్తూ పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొన్న ఓ జంటను ఇండోనేషియా  అధికారులు కఠినంగా శిక్షించారు. యువతీయువకుడి వీపుపై వంద బెత్తం దెబ్బలతో విమానం మోత మోగించారు. ఈ సంఘటన ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా అకే ప్రావిన్స్‌కు చెందిన ఓ ప్రేమికుల జంట వివాహం చేసుకోకుండానే శృంగారం చేస్తూ పట్టుబడ్డారు. దీంతో ఇండోనేషియా  అధికారులు వారికి వంద బెత్తం దెబ్బల శిక్ష విధించారు. 

వీరిని శిక్షించటానికి ఓ వేదికను ఏర్పాటు చేశారు. మొదట యువతిని వేదికపై నిలబెట్టి బెత్తంతో కొట్టడం ప్రారంభించారు. దెబ్బల దాటికి తట్టుకోలేక యువతి కన్నీరుమున్నీరైంది. విడిచి పెట్టమని  అధికారుల కాళ్లావేళ్లాపడింది. అయినా అధికారులు కనికరించలేదు. యువతి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వంద దెబ్బలు కొట్టిన తర్వాతే వదిలిపెట్టారు. ఇక ఆమె ప్రియుడికి కూడా ఇదే శిక్షను విధించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో జూదం, మద్యం సేవించటం, స్వలింగ సంపర్కం, పెళ్లికి ముందు శృంగారం వంటి వాటికి బెత్తంతో వంద దెబ్బలు కొట్టే శిక్షలు విధిస్తుంటారు. 

కాగా గత మార్చి నెలలో కూడా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడిచిన ముస్లిం అవివాహిత యువతీ యువకులకు సైతం వంద బెత్తం దెబ్బలు రుచిచూపించామని అధికారులు అన్నారు. ఇకపై ఎవరైనా పెళ్ళికి ముందు శృంగారం లో పాల్గొన్న కఠిన చర్యలు తప్పవని ఇండోనేషియా  అధికారులు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: