చిరంజీవిని ఒక రాజకీయ నాయకుడిగా సంబోధించడం కంటే మెగా స్టార్ చిరంజీవి అంటేనే చిరు కూడా సంతోష పడుతారు. ఎందుకంటే చిరు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ తన పనేదో తానూ చూసుకుంటున్నారు. బయట కూడా పెద్దగా చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. చిరంజీవి కూడా ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇంకా చెప్పాలంటే చిరు ఇప్పటికీ సినీ హీరోగా గుర్తింపు పొందటానికి ఇష్టపడతాడు తప్పించి రాజకీయ నాయకుడిగా కాదు. రాజకీయాలు ఎలా ఉంటాయో రాజకీయాల్లో ఉండాలంటే ఎలా ఉండాలో చిరుకి తెలిసినంత మాదిరిగా ఎవరికీ తెలియదని చెప్పాలి.


అందుకే ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని చిరు చాలా సార్లు బాధపడ్డారు. అలాంటింది ఇప్పుడు చిరు బీజేపీలోకి వెళుతున్నాడని కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారిని ఏమనాలో అర్ధం కావటం లేదు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి జనాల్లోకి వచ్చినప్పుడు కూడా చిరు ఒక్క మాట మాట్లాడింది లేదు. కనీసం ఎన్నికలప్పుడు అయినా జనసేన పార్టీని గెలిపించమని ఎక్కడ చెప్పింది లేదు. అలాంటిది చిరు ఇప్పుడు బీజేపీలోకి పోయి ఉద్దరించేది ఏంటని కొంత మంది ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇప్పుడు బీజేపీలోకి పోవటమంటే చిరుకు మిగిలిన ఆ పొలిటికల్ మైలేజ్, సినీ అభిమానం పోగొట్టుకోవటమేనని చెప్పాలి. 


అసలు చిరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పెద్దగా యాక్టీవ్ గా పాలిటిక్స్ చేసింది లేదు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయమని కాంగ్రెస్ ఎంత ఒత్తిడి తెచ్చిన పెద్దగా పట్టించుకున్న దాఖలు లేవు. అలాంటప్పుడు చిరు బీజేపీలోకి వస్తున్నాడన్న పుకారు పుకార్లుగానే మిగిలిపోతుంది. రాజకీయాలు తనకు సరిపడవని చిరుకు తెలుసు కాబట్టే రాష్ట్రంలో రాజకీయంగా ప్రత్యేక హోదా ఎంతో దుమారం రేపినా చిరు మాట్లాడింది లేదు. పైగా చిరు అప్పుడు రాజ్య సభ ఎంపీ కూడాను. 

మరింత సమాచారం తెలుసుకోండి: