మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి సభ్యుడు కాబోతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు సుఖేందర్ రెడ్డి పేరును గులాబీ  దళపతి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరపున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాకు సూచించారు. ప్రగతి భవన్ లో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించిన  అంతా అనుకున్నట్టు గానే సుఖేందర్ రెడ్డి పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరినైనా పరిశీలించారా లేకపోతే కేవలం ఆయన పేరు మాత్రమే పరిశీలించి ఆయనని నామినేట్ చేశారా అని అందరిలో మెదులుతున్న ప్రశ్న.





మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల సందర్భంలోనే గుత్తా సుఖేందర్  రెడ్డి పేరు ప్రకటించారు. రెండు పేర్లు ఆ సందర్భంలోనే ప్రకటించగా మల్కాజ్ గిరి నుంచి పోటీలో ఉన్నటువంటి  రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ముందుగా పరిగణలోకి తీసుకున్నప్పటికి, తర్వాత నవీన్ రావు టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం భావించింది. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని కాదనుకొని నవీన్ రావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ రాజశేఖరరెడ్డికి ఎంపీగా అవకాశమిచ్చారు. దీంతోపాటు నల్గొండ లో కూడా గుత్తా సుఖేందర్  రెడ్డి పేరును ఎంపీ గా పరిశీలించినప్పటికీ, ఎమ్మెల్సీ ఇద్దామనుకుంటున్నామని  ముఖ్యమంత్రి ప్రకటించారు.






ఈ తరుణంలోనే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రావుకు  ఎం పీ గా అవకాశమిచ్చారు,తరవాత  గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.పద్నాల్గవ  తేదీ లోపు నామినేషన్ వేయాల్సిందిగా ఆయన కోరారు. దాదాపు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సూచనలు బాగా ఉన్నాయి.  నూట పంతొమ్మిది సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీలో మొన్న చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి మిత్రపక్షం ఎంఐఎం తో కలిసి  దాదాపుగా నూట ఆరు సీట్లు టీఆరెస్ వైపే ఉన్నట్లు అంచనా.  కాంగ్రెస్ నామినేషన్ కూడా ఉండే అవకాశం లేదు ఒక రకంగా టెక్నికల్ గా చూసినట్లయితే టీఆర్ఎస్ శంకర్ యాదవ్ రెడ్డి టీఆరెస్ నుంచి ఎంఎల్సీగా  ఎన్నికై ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరగా ఆయన బహిష్కరణకు గురయ్యారు.ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ ఎంపీ గా ఉన్నారు.







ఇప్పుడు రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గా  కొనసాగిస్తున్నారు, దీంతో పాటు ఆయన త్వరలో కేబినెట్ లోకి వస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. ముందు నుంచే ఆయనకు క్యాబినెట్ లోకి రావాలనే తన కోరికను ముఖ్యమంత్రి వద్ద వెల్లబుచ్చారు. టీఆర్ ఎస్ లో చేరిన సుఖేందర్ రెడ్డి పర్యటనలోనే క్యాబినెట్ లో కొనసాగుతారని  భావించారు. కానీ పోయిన ఎన్నికల్లో జరగలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించారు కానీ, ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత క్యాబినెట్ లోకి తీస్కుంటారని భావించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇక క్యాబినెట్ లోకి రావడానికి ఆయనకి ఎలాంటి అడ్డంకీ లేదని, క్యాబినెట్ విస్తరణ కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది కాబట్టి క్యాబినెట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఏకగ్రీవంగా  ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.







అంతేకాదు కేవలం ఎమ్మెల్సీగా నామినేట్ చేయడమే కాదు మంత్రి వర్గ విస్తరణలో సైతం గుత్తా సుఖేందర్ రెడ్డి కి స్థానం కల్పించే అవకాశాలపై పార్టీ యోచిస్తున్నట్టుగా, అలాగే గుత్తా వర్గీయులు అనుకుంటున్నట్టుగా సమాచారం. రేపు విస్తరణలో గుత్తాకు అవకాశం దక్కుతుందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడైతే ఆయనకు ఎమ్మెల్సీగా నామినేషన్ లో ఆయన పేరును ఖరారు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: