ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 'అమెరికా రోడ్ల'పై తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం గత నెల 30వ తేదీన అమెరికాకు వెళ్లిన చంద్రన్న అమెరికా రోడ్లపై సామాన్యుడిలా పాప్‌కార్న్‌ తింటూ, తిరుగుతు, అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆలా తిరుగుతున్న వీడియోని తీసి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టాడు.     


దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోని చుసిన కొంతమంది నెటిజన్లు చంద్రన్న 'రిలాక్సింగ్' అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొంతమంది ఎల్లో మీడియా కార్యకర్తలు 'చంద్రన్న అమెరికా పర్యటన'పై సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. 'చూశారా, మా చంద్రన్న సామాన్యుడిలా, ఎంత చక్కగా రోడ్లపై తిరుగుతున్నారో' అని వ్యాఖ్యలు చేస్తున్నారు.     


అయితే మరి కొందరు ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ 'ఏంటి ? ప్రతిపక్షంలో ఉన్నారని ప్రతిపక్ష నాయకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా ? ఇప్పుడు మీకు అవసరం లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కష్టాలు ? ఇప్పుడు ఆంధ్రలో ప్రజలు ఏమి అయిపోయిన పర్వాలేద ? ఆలా అయితే రాజకీయ సన్యాసం తీసుకోండి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఎప్పుడు బిజీగా, కోపంగా ఉండే చంద్రన్న ఒక్కసారిగా ఇలా సరదాగా తిరుగుతూ కాలక్షేపం చేసే చంద్రన్నని చూసి చాలామంది తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారట. ఇది మాత్రమే కాదు నిన్నటికి నిన్న చంద్రన్న భార్య భువనేశ్వరితో కలిసి అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో భోజనం కూడా చేశారు.   


  

మరింత సమాచారం తెలుసుకోండి: