ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ అన్న క్యాంటీన్ల మూసివేతపై మండిపడుతున్నారు. పేద వాడి నోటి దగ్గర అన్నని లాగేసుకున్న వైసీపీ అంటూ ట్విట్ల వర్షం కురిపిస్తున్నాడు.  


నాడు నేడు అంటూ .. చంద్రన్న పాలనలో అన్న క్యాంటిన్ పరిస్థితిని, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న అన్న క్యాంటిన్ పరిస్థితిని వీడియోలో చూపిస్తు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసి ట్విట్ చేశారు నారా లోకేష్. ఇప్పుడు నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చేందుకే తప్ప, వ్యాపారం చేసి లాభాలు ఆర్జించేందుకు కాదు. కానీ వైకాపా ప్రభుత్వం పేదల ఆకలి వదిలి లాభాలు ఆశిస్తోంది, రావని తెలిసి పేదోడి ఆకలితో మాకు పనేంటని మొత్తానికే క్యాంటీన్లను మూసేసింది. శభాష్ రాజన్న రాజ్యం.. కష్టజీవుల నోటి దగ్గర కూడు లాగేసినందుకు.' అంటూ వ్యాఖ్యలు చేశారు. 


అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నారా లోకేష్ ట్విట్లకు స్పందిస్తూ 'హేరిటేజ్ సొమ్ముతో ఏమైనా అన్న క్యాంటిన్లు నిర్మించవ లోకేష్ బాబు అంటూ ఉదయం నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ నారా లోకేష్ వాటికీ స్పందించకుండా ఇలా అన్న క్యాంటీన్లపై ట్విట్లు చేస్తూనే ఉన్నారు. అయితే నెటిజన్లు కూడా స్పందిస్తూ 'కొంచం ఆగండి అన్నిటికి లెక్క చెప్తారు జగనన్న. వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు ఎం అవ్వలేదు' అంటూ వ్యాఖ్యానించారు. మరి కొంతమంది 'మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న క్యాంటిన్లు తెరిచి ఉన్న, ఆ క్యాంటీన్లలో అన్నం ఎప్పుడు లేదు, అది తెరిచినా, మూసేసిన పెద్ద తేడా ఎం లేదు అంటూ వ్యాఖ్యానించారు.       



మరింత సమాచారం తెలుసుకోండి: