ఆంధ్ర రాష్ట్రంలోని ఎయిర్ పోర్టుల నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడపడం ఇప్పట్లో సాధ్యపడేలా లేదు. విజయవాడ, తిరుపతి నుంచి కొత్త సర్వీసును ప్రారంభించటానికి విశాఖ నుంచి మరిన్ని నగరాలకు విస్తరించటానికి గల్ఫ్ దేశాలకు చెందిన కొన్ని విమానయాన సంస్థలు చేస్తున్న ప్రయత్నాన్ని కేంద్రం అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ నగరాల నుంచి ఆశించిన స్థాయిలో అంతర్జాతీయ ట్రాఫిక్ అవకాశం ఉన్నా, ఒక్క విశాఖ మినహా మిగిలిన రెండు నగరాల నుంచి గల్ఫ్ కు విమానాల ఊసేలేదు.




తిరుపతి నుంచి ఒక్క అంతర్జాతీయ విమానం కూడా లేదు. ప్రస్తుతం దుబాయి నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు ఎయిర్ ఇండియా సర్వీసును నడుపుతోంది. ఇది లాభదాయక దారులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మార్గంలో విమానాలు నడపడానికి కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నా కేంద్రం అనుమతించడం లేదని సమాచారం. ఇక విజయవాడ మార్గంలో కూడా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ డిమాండున్న గల్ఫ్ ను కాదని సింగపూర్ కు సర్వీసులు నడిపారు. అది వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద కొంత కాలం నడిపి ఆ తర్వాత ఆపేయడం విమర్శలకు తావిచ్చింది. కువైట్ లోని జజీరా ఎయిర్ లైన్స్ దక్షిణాదిన విస్తరించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఆ సంస్థతో చర్చించి తిరుపతి నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపించే అవకాశముంది.






ఏపి తో సహా దేశంలోని ఇతర నగరాల నుంచి గల్ఫ్ దేశాలకు నూతన విమాన సర్వీసును అనుమతించడంలో మోదీ సర్కార్ కావాలనే నిరాకరణ వైఖరిని చేపడుతోందని చెబుతున్నారు.  భారత్ కువైట్ మధ్య వారానికి పన్నెండు వేల మంది, భారత్, యూఏఈ మధ్య వారానికి అరవై ఆరు వేల ఐదు వందల మూడు మంది ప్రయాణీకుల్ని ఇరు దేశాలకు చెందిన ఎయిర్ లైన్స్ రవాణా చేసేందుకు ఇరుపక్షాల ఒప్పందాలున్నాయి. గల్ఫ్ దేశాల ఎయిర్ లైన్స్ తమ కోటాను పూర్తిగా వినియోగిస్తుండగా భారతీయ ఎయిర్ లైన్స్ మాత్రం విమానాల కొరతతో వెనుకబడ్డాయి.  జెట్ ఎయిర్ వేస్ మూసివేతతో భారత్ సామర్థ్యం మరింత తగ్గింది . ఆ రాష్ట్రాలలో అంతర్జాతీయ  విమాన సర్వీసులను  ప్రారంభిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు కూడా పెంపొందిచుకునే అవకాశాలు కూడా మెరుగవ్వచ్చు. ఇక మోదీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: