2014 లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాలు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక అవడం జరిగింది. అయితే ఎన్నో విపత్కర పరిస్థితుల్లో విభజించబడ్డ ఆంధ్రకు చంద్రబాబు వంటి సమర్థులైన వ్యక్తి అయితే సక్రమమైన పాలనను అందించి, సమస్యలను పరిష్కరించి రాష్ట్రాన్ని గాడిలో పెడతారని ప్రజలు భావించి ఆ పార్టీకి ఓటేయడం జరిగింది. 

ఇక చంద్రబాబు గారు కూడా అప్పటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చాలావరకు అమలు చేసి ప్రజల మెప్పు పొందారనే చెప్పాలి. అయితే కేవలం రెండే రెండు అంశాల వల్ల మొన్నటి 2019 ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా తమ ఓటు బ్యాంకును కోల్పోవలసి వచ్చిందనేది కొందరు ఇప్పటికీ చెప్తున్న మాట. అందులో ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయితే, మరొకటి విభజన హామీలు నెరవేర్చడం. కేవలం ఆ రెండు హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం అవడం వారి ఓటమికి కారణభూతంగా చెప్తున్నారు. అయితే అవి రెండూ పూర్తిగా కాదు, కేవలం కొంత మాత్రమే కారణం అనేది మరికొందరి వాదన. ఇక వారు చెప్తున్న ప్రకారం, అప్పట్లో నూతన రాజధాని అమరావతి కోసం భూముల సేకరణ సక్రమ రీతిన జరుగలేదని, అలానే ఆ భూముల విషయమై పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని, దానివలన కూడా టిడిపికి మరికొంత నష్టం ఏర్పడిందట. ఇక నేడు అదే భూముల అంశంపై ఒక సరికొత్త పుకారు, పలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. 

అదేమిటంటే, అమరావతిని ఆంధ్రకు రాజధానిగా ఎన్నుకున్న తొలినాళ్లలో, చంద్రబాబు గారు తన బావమరిది మరియు హిందూపురం ఎమ్యెల్యే అయిన నందమూరి బాలకృష్ణ గారికి కొన్ని వందల ఎకరాల భూమిని అప్పనంగా అత్యల్ప ధరకు కట్టబెట్టినట్లు ఆ వార్తల సారాంశం. అంతేకాక ఈ వార్తను అప్పటి టీడీపీ మంత్రివర్గంలోని ఒక మంత్రివర్యులే స్వయంగా ఇటీవల బయటపెట్టారని అంటున్నారు. వాస్తవానికి విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని, కాబట్టి అందులో నిజానిజాలు నిగ్గుతేలేవరకు దీనిని ఒట్టి పుకారుగానే పరిగణించవలసి ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: