తెలుగు దేశం పార్టీ నాయకత్వం విషయంలో మరో తుపాను చెలరేగనుందా? రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ నాయకత్వ విషయంలో పోరాటం మొదలుకానుందా దాదాపు రెండు దశాబ్దాల నుంచి పార్టీపై ఏకచత్రాదిపత్యాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడి ఆధిక్యతను ప్రశ్నించే వాళ్లు తయారవుతున్నారు తెలంఉగుదేశం పార్టీ! రాష్ట్ర విభజన తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నట్టుంది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల గురించి వారు మాట్లాడుతుండటమే రుజువు. రాష్ట్ర విభజన పూర్తి అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి తెలంగాణ వ్యక్తికే ఇవ్వాలని టీడీపీ ఎంపీ రమేశ్ రాథోడ్ అంటున్నాడు! అంటే టీడీపీ పగ్గాలు నారా ఫ్యామిలీ పరిధి దాటి వేరే వాళ్ల చేతుల్లోకి రావాలని వీరు కోరుతున్నారు. మరి ఇది సాధ్యమేనా?! అది సాధ్యం అవ్వాలంటే టీడీపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరగాలి! ఒకవేళ రాష్ట్రం రెండుగా విడిపోయిన తను ఒక చోట తన కుమారుడు మరోచోట పోటీ చేయాలని బాబు భావిస్తున్నాడు. అంటే రాష్ట్రం ఎన్నిముక్కలు అయినా టీడీపీ పగ్గాలు తమ కుటుంబం చేతిలోనే ఉండాలనేది బాబు వ్యూహం. బహుశా బాబు ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కూడా అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి. అలా జరిగితే టీడీపీ తెలంగాణ విభాగం అధ్యక్ష బాధ్యతలు కూడా సీమాంధ్రుడి చేతిలో ఉన్నట్లే! మరి తెలంగాణ టీడీపీ నాయకులు దీనికి ఒప్పుకొంటారా? బాబు వ్యతిరేకంగా కుట్రను లేవదీస్తారా?  

మరింత సమాచారం తెలుసుకోండి: