జగన్ కి ఎంతమంది మిత్రులు ఉన్నారో అంత మంది శత్రువులు కూడా ఉన్నారు. అసలు జగన్ రాజకీయ జీవితం మొదలైందే శత్రువులను ఎదొర్కోవడం కోసం. ఆనాడు ఎందరో శత్రువులు జగన్ మీదకు దాడి చేశారు, కనిపించి కొందరు కనిపించక మరికొందరు జగన్ని ఆటాడుకున్నారు. వారితో తొడగొట్టి మరీ సై అంటూ జగన్ రంగంలోకి దూకాడు. ఆ దూకడమే జగన్ లోని హీరోను బయటపెట్టింది. అపుడు మొదలైంది జగన్ కి ఫ్రెండ్స్ పెరగడం. ఆలా ఏపీ అంతా జగన్ ఫ్యాన్ అయిపోయింది. తాజా ఎన్నికల్లో జగన్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో తీసుకువచ్చింది ఆ ఫ్యాన్ మెయిలే.


సరే ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఇందులో తండ్రి కాలం నుంచి వస్తున్న మిత్రుడు ఒకరు ఉన్నారు. ఆయనే వరుణ దేవుడు. వైఎస్సార్ కి ముందు ఏపీకి తొమ్మిదేళ్ళు పాలించిన చంద్రబాబుకు వరుణుడికి  అసలు పడేది కాదు. అప్పట్లో కరవు కాటకాలతో ఏపీ అల్లాడిపోయేది. రైతుల ఆత్మహత్యలు కూడా ఆనాడే   ఎక్కువగా జరిగాయి. వైఎస్సార్ అలా సీఎం అయ్యారో లేదో వరుణుడు కరుణ చూపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలమంతా వానలే వానలు, రైతాంగం చాలా సంతోషించేది.


ఇక ఆయన కుమారుడు జగన్ని కూడా వరుణుడు ఆదరిస్తారని జనం అనుకున్నారు. ఇపుడు కూడా అదే రకమైన పరిస్థితి, చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో ఎండలే తప్ప వానలు లేవు.  ఒక వేళ వచ్చినా అవి  కూడా అరకొర వానలే. దాంతో జగన్ సీఎం గా ప్రమాణం చేయగానే వానలు దండీగా ఈ ఏడాది కురుస్తాయని అంతా భావించారు. దానికి తగినట్లుగా జగన్ ప్రమాణం చేసే ముందు రోజు రాత్రి బోరున విజయవాడలో వాన కురిసి టెంట్లన్నీ కూడా కూలిపోయాయి.  అపుడు జనం వరుణుడు వచ్చాడు అనుకున్నారు.


అంతే ఆ తరువాత రెండు నెలల పాటు ఎక్కడా చిన్న చినుకైనా లేదు. దాంతో వరుణుడు జగన్ మీద కూడా పగ పట్టారని అంతా అనుకున్నారు. జూన్, జూలై గడచింది.  ఇలా ఆగస్ట్ ఆరంభం కావడంతోనే వానలే వానలు. ఎన్న‌డూ లేనిది శ్రీశైలం డ్యాం నిండుతోంది. ఏపీలోని జలాశయాలకు కూడా నీరు చేరుతోంది.  ఇవే వానలు సెప్టెంబర్, అక్టోబర్ వరకూ కూడా కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది 


దీంతో వైసీపీ నేతలు ఫుల్ హ్యాపీ. దీని మీద వైసీపీ రైతు విభాగం నాయకుడు నాగిరెడ్డి మాట్లాడుతూ, జగన్ వచ్చారు, వానలు బాగా కురుస్తున్నాయి అని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ళ తరువాత ఈసారి   శ్రీశైలం డ్యాం ఎత్తేసే పరిస్థితి కూడా వస్తుందని,  క్రిష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతూ సాగర సంగమాన్ని చేరుతుందని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి వానలు కురిస్తే ఏపీకి మంచి రోజులు వచ్చినట్టే  మరి


మరింత సమాచారం తెలుసుకోండి: