మాజీ మంత్రి కోళ్లు రవీంద్రపై పేర్ని నాని సంచలన వ్యాక్యలు చేశారు. బందరు పోర్టు వివాదంపై స్పందించిన పేర్ని నాని, ఆంధ్ర ప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కోళ్లు రవీంద్ర, నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ధ్వజమెత్తారు.      


దేవినేని ఉమకి పదవి పోయిన మదం దిగలేదన్న పేర్ని నాని, కోళ్లు రవీంద్ర తాను రాజకీయంగా బతికే ఉన్న అని చెప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నాని వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జల్సాలు చేసి వచ్చి ఇప్పుడు బందరు పోర్టు కేసీఆర్ కి ఎంతకు అమ్మేశారని వివాదస్పద వ్యాక్యలు చేస్తున్నారు అని  పేర్ని నాని వ్యాఖ్యానించారు.      


కోళ్లు రవీంద్ర, దేవినేని ఉమ కలిసి బందరు పోర్టు అమ్మేశారని వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరుకు ప్రతి ఒక్కరు బందరు పోర్టు తెలంగాణకు ఎంతకు అమ్మేశారని ట్విట్లు చేసారని, చంద్రబాబుకు వయసు పెరగడంతో ఆలోచనలు సరిగ్గా లేవు అని, రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా బారి తెగిస్తారని చంద్రబాబుపై మండిపడ్డారు పేర్ని నాని.     


అయితే నారా లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చి 'పండిత పుత్ర పరమ సుంటా' అని అంటారు.. ఆ సామెతకు సరిగ్గా సరిపోతాడు నారా లోకేష్. తండ్రి రాజకీయాలలో పండితుడు.. కానీ అతడి పుత్రుడు అదే రాజకీయాలలో 'అ ఆ'లు కూడా రాని పరమ సుంటా అని.. కానీ ఆఖరికి నారా లోకేష్ కూడా బందరు పోర్టుపై ట్విట్లు చెయ్యడం హాస్యాస్పదం అని పేర్ని నాని పేర్కొన్నారు. మరి ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్ష నాయకులూ ఎలా స్పందిస్తారో చూడాలి.         


మరింత సమాచారం తెలుసుకోండి: