విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్టా జిల్లాలకు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్ట్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని 2014 ఎన్నికల్లో గెలిపిస్తుందా ... అంటే పరిస్థితులు అందుకు అనుకూలంగానే బదులిస్తున్నాయి. 2004 లో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ ను ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తిచేసినట్టైతే ఈ నాలుగు జిల్లాల రైతాంగం ఆయనకు రుణపడి ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్ట్‌ పేరుతో సుమారు రూ.2000 కోట్ల ప్రజాధనాన్ని కాజేసినట్టు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఇదీలా ఉండగా ప్రస్తుత ప్రభుత్వం నిర్ధేశించుకున్న అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ 2021 చివరినాటికి పూర్తవుతుందంటున్నారు.  అయితే అందుకు తగిన నిధుల కొరత మరోపక్క వేదిస్తోంది. ఇప్పటికే పలు పధకాలపేరుతో ప్రభుత్వంపై అధనపు ఆర్ధిక భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే.


ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాల్సిన భాధ్యత కూడా ప్రభుత్వంపై బలంగా ఉంది. అందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టాల్సిన ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని ప్రభలంగా విశ్వసిస్తున్న బీజేపీ పార్టీ కేంద్ర నిధులు కేటాయింపులో వివక్షత చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 


కేంద్రం నుంచి నిధుల రాబట్టేందుకు ప్రభుత్వం విశాలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉంటుందని విశ్లేషకులు  భావిస్తున్నారు. ఈ ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు రాబట్టడం ద్వారా ప్రాజెక్ట్‌ నిర్ధేశించిన సమయానికి పూర్తిచేసినట్టేతే రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జిల్లాల రైతాంగం ముఖ్యమంత్రి జగన్‌ పక్షాన నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించి ఉద్యోగ, ప్రజా సంఘాల బలమైన మద్దతును కూడగట్టుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: